బిజినెస్

ఇక ప్రతినెలా రూ. 1.1 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఆర్థిక మాంద్యం కారణంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో నెలకొన్న మాంద్యాన్ని చక్కదిద్దే చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈక్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల్లో ఈ వసూళ్లు ఊపందుకునేలా చేసేందుకు కృషి జరుగుతోంది. ప్రతి నెలా ఈ వసూళ్లు కనీసం 1.1 లక్షల కోట్లకు తగ్గకుండా చూడాలని సంబంధిత అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈమేరకు కేంద్ర రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పన్ను విభాగాల ఉన్నతాధికారులతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అటు ఆదాయ పన్నుతోబాటు పరోక్ష పన్నులైన జీఎస్టీ వసూళ్లలో తక్షణమే వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. ఐతే ఈ మిషతో సక్రమంగా పన్నులు చెల్లించే వారిపై ఎలాంటి వత్తిడులు, వేధింపులకు పాల్పడవద్దని ఆయన సూచించారు. 2019-20లో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు జీఎస్టీతోబాటు ప్రత్యక్ష పన్నులు 13.35 లక్షల కోట్లు వసూళ్లు చేయాల్సిందేనని ఆయన దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ మొదలుకుని వచ్చే 2020 మార్చి వరకు ప్రతినెలా 1.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు చేయాలని ఇందులో ఏదో ఒక నెలలో 1.25 కోట్ల వసూళ్లు చూపాలని పాండే ఆదేశించారని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన ఎనిమిది నెలల్లో కేవలం నాలుగు నెలల్లో మాత్రమే జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటిందని, ఒక్కసారి మాత్రమే రూ. 1.1 లక్షల కోట్లు దాటిందని ఆయన అధికారుల పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ. 6లక్షల కోట్లు (45 శాతం) మాత్రమే జరిగిందని పాండే అసహనం వ్యక్తం చేశారని సమాచారం.