తెలంగాణ

భారతీయ వైద్యాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారతీయ వైద్య విధానంలో ప్రజలకు గొప్ప నమ్మకం ఉందని, ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఈ వైద్య విధానాలను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. యోగాధ్యయన పరిషత్ తొమ్మిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన శనివారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సంబంధిత రాష్టస్థ్రాయి అధికారులు పాల్గొన్నారు. వివిధ రోగాలకు సంబంధించి భారతీయ వైద్య విధానాల్లో మంచి చికిత్స పద్ధతులు ఉన్నాయన్నారు. ప్రకృతి వైద్య చికిత్స, యునానీ, హోమియోపతి, ఆయుర్వేద విధానాల్లో అత్యంత అద్భుతమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయన్నారు. యోగాధ్యయన పరిషత్, ప్రకృతి వైద్యం దవాఖానాలపై కూలంకషంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రకృతి వైద్యం దవాఖానాలో సాయంత్రం కూడా బీపీ, సుగర్, గైనిక్ సమస్యలకు ఓపీ ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. నేచర్ క్యూర్‌లో ‘ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్’ను ఏర్పాటు చేస్తామన్నారు. నేచర్‌క్యూర్ కాలేజీలో 2021 నుండి పీజీ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. నేచర్ క్యూర్ విధానంలో ఇప్పటివరకు బెంగుళూరు ప్రథమ స్థానంలో ఉందని, భవిష్యత్తులో బెంగుళూరు కన్నా హైదరాబాద్‌ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నేచర్‌క్యూర్ దవాఖానా కోసం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు.
ప్రాణాయాంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులను ప్రవేశపెడతామని ఈటల తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారతీయ వైద్య విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
*వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్