బిజినెస్

రూ. 1.13 లక్షల కోట్లు పెరిగిన 8 కంపెనీల విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్న దేశీయ టాప్-10 కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ విలువ గత వారం 1.13 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ భారీ పెరుగుదలలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిడెట్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా మార్కెట్ విలువ మెరుగుపడిన కంపెనీల జాబితాలో చోటు సంపాదించాయి. అయితే, గత వారం జరిగిన లావాదేవీల్లో హిందుస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), ఐటీసీ భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయి. మిడ్ క్యాప్ జాబితాలో టీసీఎస్ మార్కెట్ విలువ గత వారం 56,604.72 కోట్లు పెరగడంతో, 8,33,986.26 కోట్ల రూపాయలకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ 18,475.04 కోట్లు మెరుగుపడి, 7,09,932.25 కోట్లుగా నమోదైంది. రిల్ విలువ 10,744.95 కోట్లు అధికం కావడంతో, 10,13,892.21 కోట్లకు చేరింది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ విలువ 8,962.42 కోట్లు అధికమై, 4,15,667 రూపాయలకు చేరింది. ఇన్ఫోసిస్ 8,836.30 కోట్లు మెరుగుపరచుకొని, 3,11,719.03 కోట్ల రూపాయలకు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ విలువ 5,491.87 కోట్లు పెరిగడంతో 3,53,043.84 కోట్ల రూపాయలకు చేరింది. ఎస్బీఐ విలువ 4,596.17 కోట్ల రూపాయలు పెరగడంతో 3,01,518 కోట్ల రూపాయలుగా నమోదైంది. కోటక్ మహీంద్ర బ్యాంక్ విలువ 253.14 కోట్లు పెరిగి, 3,23,489.31 కోట్లకు చేరింది. ఈ కంపెనీల మార్కెట్ విలువ పెరిగితే, అందుకు భిన్నంగా హెచ్‌యూఎల్ విలువ 12,599.20 కోట్ల రూపాయలు తగ్గడంతో, 4,21,510.56 కోట్ల రూపాయలకు పతనమైంది. అదే విధంగా ఐటీసీ విలువ 491.58 కోట్లు తగ్గడంతో 2,96,479.45 కోట్ల రూపాయలకు పడిపోయింది. మొత్తం మీద మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్న దేశీయ టాప్-10 కంపెనీల జాబితాలో రిల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఆతర్వాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐటీసీ ఉన్నాయి. గత వారం మొత్తం భారత స్టాక్ మార్కెట్ల లావాదేవీలను పరిశీలిస్తే, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 671.83 పాయింట్లు, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తున్నది.