బిజినెస్

వౌలిక రంగాల్లో ఖర్చు తడిసి మోపెడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలోని వౌలిక రంగాల్లో ఖర్చు తడిసి మోపెడవుతున్నది. అంచనా వ్యయానికి, ఆతర్వాత పెరుగుతున్న ఖర్చుకు లంకె కుదరక యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. 150 కోట్ల రూపాయలకు మించిన విలువ గల ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో 377 ప్రాజెక్టులు ఈ విధంగా అదనపు ఖర్చుతో అల్లాడుతున్నాయి. స్థూలంగా చూస్తే, అదనపు ఖర్చు 3.94 లక్షల కోట్ల రూపాయలుగా తేలింది.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం, 150 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో చేపట్టిన ప్రాజెక్టులు 1,635కాగా, వాటిలో 377 ప్రాజెక్టుల ఖర్చు భారీగా పెరిగింది. మరో 565 ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాలేదు. ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఏ ప్రాజెక్టయినా, ఆలస్యం అవుతున్న కొద్దీ, అంచనా వ్యయం పెరుగుతునే ఉంటుందనేది వాస్తవం. ముందుగా తయారు చేసుకున్న నివేదికలను అనుసరించి 1,635 ప్రాజెక్టుల అంచనా వ్యయం 19,47,462.67 కోట్ల రూపాయలు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అవి పూర్తయ్యే సమయానికి వ్యయం 23,41,784.84 కోట్ల రూపాయలకు చేరవచ్చు. అంటే, అంచనా మొత్తానికి ఇది 3,94,322.17 కోట్ల రూపాయలు అధికం. మరో రకంగా చెప్పాలంటే, ప్రాజెక్టుల వ్యయం ఊహించిన దానికంటే 20.25 శాతం పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసం నాటికి, అన్ని ప్రాజెక్టులకు కలిపి అంచనా వ్యయంలో 42.55 శాతంగా 9,96,613.94 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కొత్త షెడ్యూల్‌ను అనుసరించి, పూర్తి కావాల్సిన కాలం కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్న ప్రాజెక్టుల సంఖ్య 495కు తగ్గింది. మరో 693 ప్రాజెక్టులను మొదలుపెట్టి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. దీనితో, అవి ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిర్ణీత సమయంలో పూర్తికాని 565 ప్రాజెక్టుల్లో 182 ప్రాజెక్టులు కనీసం నెల నుంచి ఏడాది కాలం ఆలస్యం అవుతున్నాయి.
129 ప్రాజెక్టులు 13 నుంచి 24 నెలల కాలం ఆలస్యం కావచ్చు. 140 ప్రాజెక్టులు నిర్ణీత సమయాని కంటే 25 నుంచి 60 నెలలు, మరో 114 ప్రాజెక్టులు 61 కంటే ఎక్కువ నెలలు ఆలస్యం అవుతాయి. సగటున 565 ప్రాజెక్టులు 38.41 నెలలు ఆలస్యంగా పూర్తికానున్నాయి. అంచనా వ్యయం ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ ఆలస్యమే స్పష్టం చేస్తున్నది.