తెలంగాణ

‘పౌరసత్వ’ంతో ఎవరికీ నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరికి ఎలాంటి నష్టం లేదని, అసలు ఎవరు కూడా దీని వల్ల ఇబ్బంది పడరని, అపోహలను విడనాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ దశాబ్థాలుగా భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధైర్యంగా ఒక్కొక్కటి పరిష్కరిస్తూ ముందుకెళుతుంటే, ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతరం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. పౌరసత్వ చట్టం అవగాహన కల్పించేందుకు ఫేస్‌బుక్ ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచే కాకుండా రాజకీయవేత్తలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. పౌరసత్వచట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ అపోహలు, సందేహాలు కల్పిస్తూ ప్రజలను గందరగోళానికి నెడుతున్న సమయంలో ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు సరికొత్త పద్ధతుల్లోకార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన చచెప్పారు. పౌరసత్వ చట్టంపై విపక్ష పార్టీలు విష ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు ఇకపైన అయినా ప్రజల్లో గందరగోళాన్ని కలిగించవద్దంటూ ఆయన కోరారు. భారతదేశంలో 11 ఏళ్లపాటు నివసిస్తే పౌరసత్వం దక్కించుకునే వెసులుబాటు ఇప్పటికే 1955 చట్టం ద్వారా కొనసాగుతోందన్నారు. మత వాదంతో, ముస్లిం పక్షపాతంతో కళ్లు మూసుకుపోయిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మిగిలిన పార్టీలు కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పొరుగు దేశాల్లో అత్యాచారాలు చేసి అఘాయిత్లా చేసి ఆస్తులు లాగేసుకుని దాడులు చేస్తే ప్రాణ భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుటకుని మైనారిటీలు వస్తున్నారన్నారు. ఐదేళ్లకు పైగా ఇక్కడ స్థిరపడిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలకు మోదీ ప్రభుత్వం పౌరసత్వం ఇస్తోందన్నారు. వారిని భారతీయులుగా గుర్తించిందన్నారు. ఎక్కడికీ పోలేక భారతదేశానికి తిరిగి వచ్చిన మన వాళ్లను మనమే కడుమపులో పెట్టుకోవాలన్న సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమన్నారు. ఇది ఎంతో మానవత్వంతో తీసుకున్న నిర్ణయమన్నారు. దేశంలో ఏ మతానికి చెందిన పౌరుడైనా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ జాబితా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల హిందువులైనా, ముస్లింలైనా భారతీయులపైన ఎలాంటి పభవం ఉండదన్నారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న సమూహాలు చాలా బాధలు పడ్డారన్నారు. వారి జీవితాలను మరింత మెరుగుపపరిచేందుకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పౌరసత్వ చట్టాన్ని తెచ్చారన్నారు. గతంలో రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పౌరసత్వ బిల్లు ఆవశ్యకత గురించి మాట్లాడారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకుని తప్పుడు ప్రచారం చేస్తూ మ తోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తోదందన్నారు. కమ్యూనిస్టులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్నున్నారన్నారు.
'చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్