తెలంగాణ

ఆందోళనలతో ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనేది ఆందోళనలు నిర్వహిస్తేనో, ఆస్తులు దహనం చేస్తేనో ఆగేది కాదని.. అది పార్లమెంట్‌లో చట్టం చేసిందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సురేందర్ జైన్ అన్నారు. ఆదివారం రాత్రి కాచిగూడలోని జాగృతి భవన్‌లో పౌరసత్వ బిల్లుపై వీహెచ్‌పీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సురేందర్ ప్రసంగించారు. సీఏఏ అనేది ప్రధాని నరేంద్రమోది తెచ్చిన చట్టం కాదని, ఇది 1955లోనే ఉందన్నారు. ఈ చట్టం దేశంలోని ముస్లింలకు, దళితులకు వ్యతిరేకం కాదన్నారు. అస్సాంలో అమలులోకి వచ్చిన ఎన్‌ఆర్‌సీ బిల్లు కూడా సుప్రీంకోర్టు ఆదేశంతోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ దేశాలలో మత దురహంకారానికి గురై, అనేక కష్ట నష్టాలు, సాధక బాధకాలకు గురై ఆస్తులు, ఆత్మీయులను వదిలి కేవలం కట్టుబట్టలతో ప్రాణాలతో వచ్చిన మైనారిటీలు సిక్కు, జైన్, బౌద్ధ, హిందువులకు ఇక్కడ పౌరసత్వం కల్పించాల్సిన బాధ్యత నరేంద్రమోదీపై ఉందన్నారు. శరణార్థులకు ఆపన్న హస్తం అందిస్తుంటే ఓర్చుకోలేని వారు రోడ్లపై పిచ్చిపిచ్చి చేష్టలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని పార్టీల్లో ఉన్న ముస్లిం నాయకులు ముఖ్యంగా ఓవైసీ బ్రదర్స్‌తో సహా భారత్‌లో ఆస్తులు సంపాదించుకుని దుబాయ్‌లో వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దేశానికి మంచి జరగాలని, మరిన్ని చట్టాలు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, కార్యదర్శులు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... పౌరసత్వ బిల్లుపై అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న వీహెచ్‌పీ నేత సురేందర్ జైన్