తెలంగాణ

హిందూ దేశం కోసమే కొత్త చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికే బీజేపీ కొత్తచట్టాలను అమలు చేస్తోందని, దీనికి ప్రజల మద్దతు లేకపోవడంతో దేశంలో అల్లర్లు చెలరేగుతున్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. హిందూ, ముస్లిం మతోన్మాదులు ఇరువురూ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని బలపర్చారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా‘ జాతీయోద్యమ కాలంలో హిందూ, ముస్లిం మతతత్వ శక్తుల పాత్ర’ అన్న అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌లు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదని ఆయన గుర్తు చేశారు. హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌లు జాతీయోద్యమాలు, స్వాతంత్య్రోద్యమంతో కాని ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఇంకా చెప్పాలంటే హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌లు రెండూ జాతీయోద్యమానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించాయని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి వాస్తవాలను ప్రజలకు విడమర్చి చెప్పటం ద్వారా మతతత్వవాదుల అసలు రంగు బయట పెట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. హిందూ మహాసభ, ఆరెస్సెస్, ముస్లిం లీగ్‌లు ఎప్పుడూ, ఎక్కడా జాతీయోద్యంలో పాల్గొన్న సంఘటనలు కన్పించవన్నారు. ఇరువురిని బ్రిటిష్ వారు వాడుకుని స్వాతంత్య్రోద్యమాన్ని చీల్చడం కోసం శతవిధాలా ప్రయత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1905లో ముస్లిం లీగ్, 1907లో హిందూ మహాసభ, 1925లో అరెస్సెస్ ఏర్పడ్డాయన్నారు. అప్పటి నుంచి ఆయా సంస్థలు మత విద్వేషాలను రగిలించటం ప్రారంభించాయన్నారు. తద్వారా ఆయా సంస్థలు దేశ విభజనకు కారణమయ్యాయన్నారు. ద్విజాతి సిద్దాంతాన్ని ప్రోత్సహించటం ద్వారా సావర్కర్, జిన్నాలు మతకలహాలకు ఆజ్యం పోశారన్నారు. దీనిని ఆసరా చేసుకుని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశాన్ని రెండుగా విభజించారని ఆయన దుయ్యిబట్టారు. ఇలా మతోన్మాదుల గత చరిత్ర ఎంతో నీచమైనదని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, ఆరెస్సెస్ అసలు లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. దీంట్లో భాగంగానే జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లను ముందుకు తీసుకువచ్చిందన్నారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించటం వీటి ఉద్దేశమన్నారు. ముస్లింలే లక్ష్యంగా ఇలాంటి చర్యలకు బీజేపీ పాల్పడడం సిగ్గు చేటన్నారు. ప్రజాస్వామ్యం ఆ పార్టీకి ఒక్క శాతం కూడా గౌరమున్నా. ఇలాంటి చర్యలకు పాల్పడేది కాదన్నారు. న్యాయవ్యవస్థ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఎన్నికల సంఘం తదితర సంస్థలన్నింటినీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సర్కార్ తమ జేబు సంస్థలుగా మార్చుకున్నారని ఆయన కనె్నర్ర చేశారు. ఇవన్నీ పంజరంలో చిలకల్లాగా మారిపోయాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు గతంలో వ్యాఖ్యానించిన అంశాన్ని సురవరం గుర్తు చేశారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెషర్ భంగాభూక్యా మాట్లాడుతూ మనిషిని సంస్కరించగలిగే శక్తి ఉన్న మతం ..అదే మనిషిని పాతాళానికి కూడా తొక్కేయగలదని ఆయన హెచ్చరించారు. మతాన్ని,చరిత్రను ఆధిపత్యవాదులు తమకు అనుకూలంగా మార్చుకుంటారని, ప్రస్తుతం దేశంలో ఇదే జరుగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతోన్మాదమనేది కొత్తకొత్త ముసుగులతో మన ముందుకొస్తున్నదని ఆయన గుర్తు చేశారు. సమాఖ్య స్ఫూర్తి మీద దాడి చేయటమే దాని లక్ష్యమన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ లాంటి వాటిపై విశ్వవిద్యాలయాల విద్యార్థులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారన్నారు. ఈ అంశాలపై సాధారణ సమాజానికి అర్థం అయ్యేలా ఇలాంటి పరిణామాలను వివరించాలన్నారు. రాష్ట్ర సీపీఎం కార్యవర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రను వక్రీకరించడానకి మతోన్మాద శక్తులు ప్రయత్నించడం దునదృష్టకరమన్నారు. అదే పనిగా అబద్దాలు వల్లె వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ పని అయిపోయిన తర్వాత ఉమ్మడి సివిల్ కోడ్, జమిలి ఎన్నికులు, అవి కూడా అయిపోయిన తర్వాత దేశంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకురావడమే బీజేపీ అసలు లక్ష్యమన్నారు. హిందూత్వను, హిందీని దేశ ప్రజలపై బలంగా రుద్దడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన హెచ్చరించారు. దక్షిణాది నుంచి వచ్చిన నిరసనలతో హిందీని రుద్దే ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మతమనే సెంటిమెంట్‌ను ఆధారం చేసుకుని ప్రజలను విభజించేందుకు బీజేపీ ప్రయత్నించడం దుర్మార్గం అన్నారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి వీలుగా ఇలాంటి అంశాలను బీజేపీ ముందుకు తీసుసుకురావడం శోచనీయమని నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు.