తెలంగాణ

మున్సి‘పోల్స్’కు నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ‘నగారా’ మోగింది. దాదాపు ఏడాది కాలంగా నగరాలు, పట్టణాల్లోని రాజకీయ నాయకులు, ప్రజలు ఎదురుచూస్తున్న ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి పేరుతో నోటిఫికేషన్ జారీ అయింది. రాజ్యాంగంలోని 243-కే, 243-జడ్‌ఏ ఆర్టికల్స్ కింద తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి షెడ్యూల్ జారీ చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఎన్నికల్లో భాగంగా ఒకవైపు ఓటర్ల జాబితాలను రూపొందించేందుకు సోమవారంనాడే నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేశారు. దాంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ‘హల్‌చల్’ ప్రారంభమైంది.
సోమవారం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను 2020 జనవరి 7న జారీ చేస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు ఎలక్షన్ నోటీస్‌ను జనవరి 8న ఉదయం 10.30 గంటలకు జారీ చేస్తారు. ఎన్నికల నోటీస్ జారీ అయిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. జనవరి 8న వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారు. జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. వెంటనే తిరస్కరణకు గురైన నామినేషన్లపై ప్రకటన జారీ చేస్తారు. నామినేషన్లను రిజెక్ట్ చేస్తే జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. 13 సాయంత్రం 5 గంటలలోగా అప్పీళ్లను డిస్పోజ్ చేస్తా రు. 14 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. 2020 జనవరి 22న పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభించి 5 గంటల వరకు కొనసాగిస్తారు. పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే జనవరి 24న రీ-పోల్ నిర్వహిస్తారు. జనవరి 25 ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు.
*
ఎన్నికల షెడ్యూల్
*
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ 07-01-2020
రిటర్నింగ్ ఆఫీసర్ జారీ చేసే ఎన్నికల నోటీస్ 08-01-2020
నామినేషన్ల స్వీకరణ 08-01-2020 ఉ. 10.30 నుండి
వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన 08-01-2020
నామినేషన్లకు చివరి గడువు 10-01-2020
నామినేషన్ల పరిశీలన 11-01-2020
అప్పీళ్లకు గడువు 12-01-2020
అప్పీళ్ల డిస్పోజల్ 13-01-2020

నామినేషన్ల ఉపసంహరణ గడువు 14-01-2020
అర్హులైన అభ్యర్థుల జాబితాల వెల్లడి 14-01-2020
పోలింగ్ 22-01-2020
అవసరమైతే రీ-పోలింగ్ 24-01-2020
కౌంటింగ్ 25-01-2020 ఉదయం 8 గంటల నుండి
ఫలితాల వెల్లడి కౌంటింగ్ పూర్తయిన వెంటనే