తెలంగాణ

మున్సిపల్ ఓటర్ల జాబితా షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటర్ల జాబితాలకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సోమవారం జారీ చేసింది. ఎస్‌ఈసీ కమిషనర్ వి. నాగిరెడ్డి పేరుతో సోమవారం జారీ అయిన ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇలా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఫొటో గుర్తింపుతో ఓటర్ల జాబితాలను 2019 డిసెంబర్ 30న జారీ చేస్తారు. ఫొటో గుర్తింపు ఓటర్ల జాబితాలపై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 31 నుండి 2020 జనవరి 2 వరకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి. డిసెంబర్ 31న జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. మున్సిపల్ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సంబంధిత కమిషనర్లు జనవరి 1న సమావేశాలు నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాలపై ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలను జనవరి 3న పరిష్కరిస్తారు. అన్ని మున్సిపల్
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితాలను 2020 జనవరి 4న ప్రకటిస్తారు.
శాసనసభ నియోజకవర్గాల వారీగా కేంద్ర ఎన్నికల కమిషన్ 2019 జనవరి 1న జారీ చేసిన ఓటర్ల జాబితాలను మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ ఎన్నికల కోసం వినియోగిస్తారు. ఈ నెల 17న జరిగిన వార్డుల విభజన ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఈ జాబితాలను జనవరి 4న ప్రకటిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జారీ చేసే ఎన్నికల నోటిఫికేషన్‌లోగా ఓటర్ల పేర్లను తొలగించడం, నమోదు చేయడం, సరిచేయడం చేస్తామని ఎస్‌ఈసీ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.