తెలంగాణ

లోకాయుక్తగా రాములు, ఉప లోకాయుక్తగా నిరంజన్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ సి.వి. రామలు, ఉప లోకాయుక్తగా వి. నిరంజన్‌రావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం వీరిద్దరి చేత గవర్నర్ తమిళిసై
సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
''చిత్రాలు.. లోకాయుక్తగా జస్టిస్ సీవీ రాములు, ఉప లోకాయుక్తగా వీ నిరంజన్‌రావు ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు