తెలంగాణ

అంగన్‌వాడీలను కలెక్టర్లు సందర్శించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు తరచు సందర్శించి సరిగ్గా పనిచేసేలా పర్యవేక్షించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ లేఖలు రాయాలని నిర్ణయించారు. సోమవారం శాఖ డైరెక్టరేట్‌లో కార్యదర్శి జగదీశ్వర్ ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉండాలని, నాణ్యత లోపించకుండా ఆహారాన్ని తల్లులు, బిడ్డలకు అందించాలన్నారు. అక్షయ పాత్ర, ఇతర సంస్థల ద్వారా పంపిణీ జరిగే ఆహారం కూడా చల్లబడకుండా, వేడివేడిగా వడ్డించేందుకు కావల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఫుడ్స్ సంస్థలో కొత్త ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వీలైనంత త్వరలో ఈ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలని, ఆదేవిధంగా ఆహార పదార్థాల నాణ్యతపై ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ విధానాన్ని అవలంబించాలన్నారు. డైరెక్టరేట్ పరిసరాల్లో చేపడుతున్న నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు.