తెలంగాణ

తెలంగాణ భాష, చరిత్ర అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 24: తెలంగాణ భాష, చరిత్ర అభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సేవా సదన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంగీత ఆధ్వర్యంలో జిల్లా సాహిత్య సమాలోచన రెండు రోజుల సదస్సును ఆయన, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లా చరిత్రలో మొదటి సాహిత్య సమాలోచన సదస్సు అని ఈ సదస్సులో నాగర్‌కర్నూల్ చరిత్రను తెలుసుకోవడానికి మార్గదర్శకమవుతుందని అన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో పేరొందిన కవులు సురవరం ప్రతాపరెడ్డి, పాకాల యశోదారెడ్డి, దున్న ఇద్దాసు, ముకురాల రామిరెడ్డి లాంటి పేరొందిన కవులుంటే, ఆంధ్ర పాలనలో గుర్తింపు లేకపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సాహిత్య చరిత్ర కోసం అకాడమీ కృషి చేస్తున్నదని అందులో భాగంగానే 32 జిల్లాల సాహిత్య చరిత్రను రాయించినట్టు చెప్పారు. తెలంగాణ తెలుగు భాష అభివృద్ధికి కృషి జరుగుతోందని అన్నారు. తెలంగాణలో మరుగున పడ్డ కవిత్వం, కవులకు గుర్తింపు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ఇస్తోందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత నిలుపుకున్నామని అన్నారు. పోతన తెలంగాణ కవిగా గుర్తింపు తెచ్చామన్నారు. ఇలా ఎందరో మహాకవులను వెలుగులోకి తీసుకొచ్చి వారి రచనల ద్వారా చైతన్యం చేయడానికి, తెలంగాణ విశిష్టతను తెలియజేయడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. సాహిత్యం, కథలు, కవిత్వం చదవడం వల్ల విద్యార్థులు సమాజంలో చైతన్యం వస్తుందని ఆ దిశగా కవులు, రచయితలు కృషి చేయాలని సిధారెడ్డి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విప్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ నేడు నెలకొన్న పాశ్చాత్య సంస్కృతిని కొనసాగిస్తున్నా మన సంస్కృతి, సాహిత్యం, మన చరిత్రను కాపాడుకోవాల్సిన పరిస్థితి నేడు వస్తుందన్నారు. ఇలాంటి సాహిత్య సమావేశాలు నిర్వహించడం ద్వారా మన భాష, సాహిత్యం గురించి నేటితరం వారికి తెలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సాహిత్యం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ జిల్లాకు చెందిన కపిలవాయిలింగమూర్తి చిరస్మరణీయుడని ఆయన వారసత్వాన్ని కొనసాగించాలన్నారు. నెలపొడుపు సాహిత్య సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని, ఇటువంటి సాహిత్య సమావేశాలను నిరంతరం కొనసాగించాలని, దానికి సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం కవులు దరగోని శ్రీశైలం, గూడేలి శినయ్య, సంబరాజు, లీలాల రచనలను నీతి శతకం, పద్య శతకం, తంగేడు పూలు కథలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగపూరి విష్ణు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలంతో పాటు కవులు కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వల్లభాపురం జనార్ధన, వహీద్‌ఖాన్, మోహన్, దినకర్ తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... జిల్లా సాహిత్య సమాలోచన సదస్సుకు జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి