తెలంగాణ

ప్రతి విద్యార్థికీ క్రీడా స్ఫూర్తి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రతి విద్యార్థికి క్రీడా స్పూర్తి ఎంతో అవసరం అని జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, టీఎస్‌ఆర్టీసీ సీనియర్ మేనేజర్ జీ.కిరణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ హిమయత్‌నగర్‌లోని పేజ్ కాలేజీలో మంగళవారం జరిగిన క్రీడా వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును ఎలా ఎంచుకోవాలో పేరున్న క్రీడాకారుల జీవిత గాథల ద్వారా వివరించారు. జీవితం ఎంతో విలువైనదని, సమయాన్ని వృదా చేయకుండా విద్యార్థులు క్రీడల్లోనూ అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు. ఆటల ద్వారా వ్యాయామంతో పాటు గెలుపోటములను తట్టుకునే శక్తి ఏర్పాడుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు రామణారావు, సమీర్, క్రీడోత్సవ నిర్వహకుడు శివ కళాధర్, ప్రిన్సిపాల్ వసంత, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.