తెలంగాణ

మతం ఆధారంగా పౌరసత్వం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: మతం ఆధారంగా పౌరసత్వం ఎంత మాత్రం తగదని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. మతోన్మాదంపై అఖిల పక్ష సభ ఆలోచన సబబైనదేనని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ, సీఏఏను అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మరో పక్క సీపీఎం 27వ తేదీన రాజ్యాంగాన్ని రక్షించాలనే అంశంపై బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్ వస్తున్నారు. 27వ తేదీ ఉదయం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే అంశంపై సెమినార్ జరుగుతుంది, దానికి సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఏఏ- ఎన్‌ఆర్‌సీ అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం బహిరంగ సభకు సైతం హాజరవుతారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలు ప్రజస్వామిక లౌకిక వ్యవస్థలకు వ్యతిరేకమని రాఘవులు విమర్శించారు. సీఏఏ, ఎన్సార్సీతో అంతర్జాతీయంగా భారత్ సంబంధాలు తగ్గుతున్నాయని అన్నారు. జనవరి 30న గాంధీ వర్ధంతి రోజున బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలతో అఖిల పక్ష సభను నిర్వహించాలని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసిందని, అది సబబేనని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసిన టీఆర్‌ఎస్ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి స్పందనలు లేకుండా ఉందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల షెడ్యూలులో మార్పు చేయాలి
మున్సిపల్ ఎన్నికల షెడ్యూలులో మార్పులు చేయాలని తమ్మినేని వీరభద్రం కోరారు. మున్సిపాల్టీల్లో రిజర్వేషన్లను ప్రకటించకుండానే షెడ్యూలును విడుదల చేశారని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను, జనవరి 8న కార్మిక సమ్మె గ్రామీణ బంద్‌లు దృష్టిలో ఉంచుకోకుండా తేదీలను ప్రకటించడం సరికాదని అన్నారు. వెంటనే రిజర్వేషన్లను ప్రకటించి పండుగకు, కార్మిక సమ్మెకు గ్రామీణ బంద్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా ఎన్నికల షెడ్యూలులో మార్పులు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలవాలని సమావేశం నిర్ణయించింది.