బిజినెస్

ఎన్‌ఆర్‌సీ భారత్ ఆంతరంగికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) రూపకల్పన అన్నది పూర్తిగా భారతదేశ ఆంతరంగిక వ్యవహారమని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. రెండు దేశాల సరిహద్దు పరిరక్షక దళాల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయని బీజీబీ డైరెక్టర్ జనరల్ షఫీనుల్ ఇస్లాం ఆదివారంనాడు ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు బంగ్లాదేశ్ సరిహద్దు దళాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. భారతదేశ సరిహద్దు దళాల అధికారులతో చర్చలు జరిపేందుకు ఇస్లాం సారథ్యంలో బంగ్లాదేశ్ బృందం భారత్ పర్యటనకు వచ్చింది. 26 నుంచి జరిగిన ఈ చర్చలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా రెండు దేశాల సరిహద్దు దళాల అధినేతల మధ్య అనేక అంశాలపై విస్తృతంగా సమాలోచనలు సాగాయి. ఎన్‌ఆర్‌సీ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు మాట్లాడిన షఫీనుల్ ఇస్లాం ‘ఇది పూర్తిగా భారతదేశ ఆంతరంగిక వ్యవహారం. మా ప్రమేయం ఏమీ ఉండదు’ అని స్పష్టం చేశారు.