తెలంగాణ

జగన్, బాబు ఒకే తాను ముక్కలు: సీపీఐ నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై ఇంకా రగడ కొనసాగుతునే ఉందని, ఏపీలో పరిస్థితులకు ఇద్దరు నేతలూ కారణమేనని పేర్కొంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఒకే తానుముక్కలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. రాజధాని భూములు ప్రభుత్వాలకు సొంత ఆర్ధిక ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని, నేతల ఆర్ధిక అవసరాలకు వేదికగా మారాయని అందుకే రాజధాని భూముల విషయంలో ఈ రగడ కొనసాగుతోందని అన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు అంశం ప్రస్తావనే లేదని నారాయణ అన్నారు. రాజధాని మార్పు అంశం రైతులు నిరసన దీక్షలపై స్పందిస్తూ రాజధాని పేరుతో చంద్రబాబు వేల ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం చేపట్టాలని భావిస్తే , సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఆ భూములను సెజ్‌ల పేరుతో పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని మూడు రాజధానుల అంశం అకస్మాత్తుగా తెరమీదకు తీసుకురావడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు. రాజధాని మార్చే నైతిక హక్కు జగన్‌కు లేదని అన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.