తెలంగాణ

కలిసొచ్చిన వర్షాకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు రూ. 700 కోట్ల భారం తగ్గిందని రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం విద్యుత్ సౌధలో విద్యుత్ శాఖలో ఓసీ ఉద్యోగ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ గడచిన ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు విద్యుత్ శాఖకు కలసివచ్చిందన్నారు. కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుతో పాటు దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుల నుంచి జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి 1800 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా 4వేల మిలియన్ యూనిట్ల అధిక జల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. దీంతో తెలంగాణ విద్యుత్‌కు రూ.700 కోట్ల భారం తగ్గడానికి కారణమైయిందన్నారు. విద్యుత్‌శాఖలో అందరూ కలసి పని చేస్తేనే విద్యుత్ సంస్థ ముందడుగు వేస్తుందన్నారు. సమష్టిగా ఉద్యోగులు అందరూ తమ సమర్థతను నిరూపించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మూడు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థలకు భిన్నంగా తెలంగాణ విద్యుత సంస్థలు సమర్థవంతంగా పని చేయడంతో జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోందన్నారు. వీటిని కొనసాగించడానికి ప్రతి ఉద్యోగి మరింత పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇంత జలవిద్యుత్ ఉత్పత్తి జరగలేదని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ వినియోగాదారులను సంతృప్తి చేయడమే ఉద్యోగుల ప్రథమ కర్తవ్యం అన్నారు. వినియోగదారులకు సకాలంలో విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు వారి మన్ననలను పొందాలన్నారు. విభజన చట్టం మేరకు విద్యుత్‌శాఖలో ఉద్యోగుల పంపకాల్లో ధర్మాధికారి తీర్పుపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. అయితే ధర్మాధికారి తీర్పు పట్ల కేంద్ర, రాష్ట్రాలు చర్చిస్తాయని, అంతవరకూ వేచిచూద్దాం అన్నారు. అప్పటిదాకా ఉద్యోగులు సంయమనం పాటించాలన్నారు. ధర్మాధికారి తుదితీర్పు రావడంతో ఆంధ్రాకు బదిలీ అయిన ఉద్యోగులు మళ్లీ తెలంగాణకు వస్తారేమో అన్న అనుమానాలు ఉద్యోగుల్లో ఉందన్నారు. డైరీ ఆవిష్కరణకు ముందు ఓసీ ఉద్యోగుల సంఘం అసోషియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలకు ప్రభాకరావు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు. అనతికాలంలోనే విద్యుత్ సంస్థలను మెరుగైన స్థితికి తీసుకువచ్చిన ఘనత దేవులపల్లి ప్రభాకర్‌రావు దక్కిందన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి సీఎండీ ప్రభాకర్‌రావు డైరీ ఆవిష్కరణకు వచ్చినందకు కృతజ్ఞతలు అంటూ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ భానుప్రకాశ్ అన్నారు.

'చిత్రం... ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరిస్తున్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, భానుప్రకాశ్