తెలంగాణ

పౌరసత్వ చట్ట సవరణపై రేపటి నుంచి బీజేపీ అవగాహన సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 31: పౌరసత్వ చట్ట సవరణపై ఎవరికి ఆందోళన అవసరం లేదని, భారతదేశంలోని 134 కోట్ల మంది ప్రజలకు ఇది ఎమాత్రం వర్తించదని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టీ. రాజేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం కాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విపక్ష నేతలు, ఒక వర్గానికి సంబంధించిన మత పెద్దలు పౌరసత్వ చట్ట సవరణను రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో భయాందోళన కల్పిస్తున్నారన్నారు. ఈ చట్ట సవరణపై తెలంగాణ అంతట అవగాహన కల్పించి, అపోహలను తొలగించేందుకు ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు తెలంగాణ అంతట వర్క్‌షాప్‌ను, అవగాహన సదస్సులు చేపడుతామని ఆయన వెల్లడించారు. స్వార్ధపర శక్తులను ఎండగట్టి ప్రజలకు ఈ చట్ట సవరణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. మైనార్టీ ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక పథకం ప్రకారం విపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. దేశంలో ఒకప్పుడు 12శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు 25శాతానికి పెరిగిపోయారని, త్వరలోనే అది 30శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. మరో బెల్జియం దేశంలాగా మారిపోయో ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు ఏదైనా ఇబ్బంది వచ్చినట్లైతే ఒక్క భారతదేశం తప్పా మరే ఇతర దేశంలో స్ధానం లేదని అదే క్రిస్టియన్, ముస్లింలకు అపద వచ్చినట్లైతే వారిని ఆదుకునేందుకు అనేక దేశాలు ఉన్నాయన్నారు. కుహాన లౌకీక వాదులు అని చెప్పుకునే కాంగ్రెస్ వామ పక్షాలకు చొరబాటు ధారులు ఓటు బ్యాంక్‌గా మారారని అన్నారు. దేశంలో అస్థిరత సృష్టించడానికి ఒక వర్గం కుట్ర పన్నుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ నివసిస్తున్న ముస్లింతేర వారు ఇబ్బందులు పడుతూ శరణార్ధులుగా మారి దేశానికి వచ్చారని అలాంటి వారికి ఈ పౌరసత్వం కల్పించాలనేది ఈ చట్ట సవరణ అని అన్నారు. దీనిని గతంలోనే అప్పటి ప్రధాని నెహ్రు, ఇందిరాగాంధీ సహా అందరు అంగీకరించారని తెలిపారు. పౌరసత్వ చట్టసవరణపై ఇటీవల కాజీపేటలో ఆందోళన చేసిన ముస్లిం మత పెద్ద ఖుస్రు పాషాపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ చట్టం ద్వారా ఖుస్రు ద్వారా పౌర సత్వం రద్దు అవుతుందా సూటిగా చెప్పాలాని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటున్నప్పటికి కొందరు మత పెద్దలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దర్గా కాజీపేట అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. సామాన్య ప్రజలెవరు వీరిలో మాయలో పడవద్దని ఆయన కోరారు. సమావేశంలో బీజేపి మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం, మోడం సదానందం, ఉడుగు శ్రీనివాస్, హరిశంకర్, అంకేశ్వర కుమారస్వామి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.