తెలంగాణ

కేంద్రం పాలనపై ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనపై ఉద్యమాలు అనివార్యమవుతున్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం నాడు ఆయన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2020 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత కీలకమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని చెప్పారు. నేటి ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్ల ఉపాధ్యాయులకు వృత్తిపరమైన గౌరవం, సరైన జీతభత్యాలు, సౌకర్యాలు లభించకుండా వారి వృత్తి చాలా కష్టతరమైన వృత్తిగా సాగుతోందని అన్నారు. ఉపాధ్యాయులు అందించే విలువలతో కూడిన విద్య సమాజాభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. పాపాల పుట్ట ప్రపంచీకరణ ఆర్ధిక దోపిడీలో భాగంగా విద్యారంగం కూడా ప్రైవేటీకరణ పాలైందని దీంతో పేదలు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. ప్రజాశ్రేయస్సు పట్టని ప్రభుత్వాలు విద్యారంగం మూత్తం కార్పొరేట్ సంస్థలకు స్వాధీనం చేశారని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో పురాణాలను చరిత్రగానూ, చరిత్రను పురాణాలుగా చిత్రీకరిస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలతో తప్పుడు పాఠ్యాంశాలను, తప్పుడు పద్ధతుల్లో బోధించడానికి ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో సృజనాత్మక విద్యతో పాటు వారికి శాస్ర్తియ దృక్పథాన్ని, సక్రమ భావజాలాన్ని అలవర్చడంలో ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని అన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సరైన నిధులను కేటాయించక, ప్రోత్సాహం ఇవ్వక విద్యారంగాన్ని వివక్షకు గురిచేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి జీ సదానందం గౌడ్, కార్యదర్శి వై కరుణాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డీ సుధాకర్‌లు పాల్గొన్నారు.

'చిత్రం... డైరీ ఆవిష్కరిస్తున్న సీపీఐ సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు