తెలంగాణ

సామాన్యుడికి ఉపయోగపడేలా ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాంకేతికత సా మాన్యుడికి మేలు చేసేలా ఉండాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సాంకేతిక ఫలాలు ప్రజలకు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతికతలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ 2020 సంవత్సరాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్‌గా కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ లోగో, వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ సాంకేతికతను అందించనున్న వివిధ సంస్థలతో మంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికతను మానవాళికి ఉపయోగకరంగా మలుచుకోవాలన్నారు. ప్ర జల దైనందిక జీవనంలో సాంకేతికత ఎంతో దోహదం చేస్తుందన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రారంభించిన టీ-హబ్‌కు ఎంతో ఆదరణ లభించిందని గుర్తుచేశారు. స్టార్టప్‌లతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అందుకే త మ ప్రభుత్వం సాంకేతికతను అమితంగా ప్రో త్సహిస్తుందని చెప్పారు. హెల్త్‌కేర్, మోబిలిటీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఇంటెల్, పిహెచ్‌ఎఫ్‌ఐలతో పాటు వివిధ స్కిల్ ట్రెయినింగ్ సెం టర్ల ఏర్పాటు, హెక్సగాన్ సెంటర్, నార్వే క్లస్టర్ ఆఫ్ ఐప్లెడ్ ఆర్టిఫీషియల్‌తోనూ, మహేంద్రా కాలేజీ, నా స్కామ్‌తో ఐటీశాఖ ముఖ్య కార్యద ర్శి జయేశ్ రంజన్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.