తెలంగాణ

మున్సి‘పోల్’కు పార్టీలు సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: రాష్ట్రంలో ఒకవైపు విపరీతమైన చలి వీస్తుండగా మరోవైపు, మున్సిపల్ ఎన్నికల సెగతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఆరు నెలలుగా వాయిదా పడుతూ, పడుతూ ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ శాఖ కూడా ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లను ప్రకటించింది. జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత స్తబ్ధంగా ఉన్న రాజకీయ పార్టీలు తిరిగి మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడగానే అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల రాష్ట్ర కమిటీలు ఎన్నికలపై దృష్టిసారించాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీతో రెండు దఫాలు సమావేశం కాగా పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు రాష్టవ్య్రాప్తంగా మున్సిపల్ ఎన్నికలపై ప్రైవేట్ సంస్థలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వేర్వేరుగా సర్వేలు చేయించి నివేదిక తెప్పించుకున్నారు. ఎన్నికలు జరుగనున్న మున్సిపల్ కార్పొరేషన్లలో పదికి పది, 120 మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్సే విజయం సాధించబోతున్నట్టు తేలినట్టు కూడా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అన్నింటినీ టీఆర్‌ఎస్ హస్తగతం చేసుకున్నట్టుగానే మున్సిపోల్స్‌లో కూడా పోటీ ఏకపక్షంగా ఉండాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. పరిషత్ ఎన్నికల్లో ఫలితాలు అధికార పక్షానికి ఏకపక్షంగా రావడంతో డీలా పడిన ప్రతిపక్షాలు ఇంకా కోలుకోక ముందే మున్సిపోల్స్‌లోనూ ఘన విజయం సాధించాలని పార్టీ నేతలకు పిలుపునిస్తూనే, ఎన్నికలకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులను బాధ్యులను చేశారు. ఎక్కడైనా ఫలితాల్లో తేడా వచ్చిందంటే సంబంధిత మంత్రికి పదవి ఊడుతుందని కూడా అధినేత కేసీఆర్ హెచ్చరించడంతో మంత్రులంతా జిల్లా బాట పట్టారు. ఇప్పటికే మంత్రులు మున్సిపాల్టీల వారీగా సమన్వయ సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన త్వరలోనే పర్యటించబోతున్నారు. ఈ ఎన్నికల ప్రచార సభలకు అధినేత కేసీఆర్ దూరంగా ఉంటారని, అంతా కేటీఆరే చూసుకోనున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. అన్ని ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను కనబరుస్తూ వచ్చిన టీఆర్‌ఎస్ మున్సిపోల్స్‌లోనూ పట్టు సడలకుండా ఫలితాలు ఏకపక్షంగా ఉండాలని పట్టుదలతో ఉంది. ఇలా ఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఉహించని ఫలితాలను సాధించడంతో అదే ఊపును మున్సిపోల్స్‌లో కొనసాగించాలని భావిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా మున్సిపల్ ఎన్నికలకు పార్టీ నేతలను సన్నద్ధం చేయడానికి సమావేశాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు జరుగనున్న అన్నింటికీ పార్టీ సీనియర్లను ఇన్‌చార్జిలుగా నియమించడంతో పాటు ఉమ్మడి పది జిల్లాలకు పరిశీలకులను కూడా నియమించారు. మున్సిపల్ ఎన్నికల వరకు రాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్యం వహించి ఆ తర్వాత తప్పుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు. పార్టీ బాధ్యతల నుంచి గౌరవప్రదంగా తప్పుకునేలా చివరగా మంచి ఫలితాలను సాధించాలని ఆయన పట్టుదలతో కృషి చేస్తున్నారు. కాగా, బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఉహించని విధంగా నాలుగు స్థానాలను గెలుచుకోవడంతో కనీసం ఆ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనైనా గౌరవప్రద సంఖ్యలో మున్సిపాలిటీలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను మున్సిపోల్స్‌కు సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్తగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డిని నియమించడంతో పాటు పార్టీ పదాదికారులను రెండు సార్లు సమావేశపరిచి ఎన్నికలకు వ్యూహరచన చేసింది.