తెలంగాణ

ఏడేళ్ల నాటి జీవో 20ను అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: హైదరాబాద్ నగరంలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించేందుకు ఉద్దేశించిన జీవో 20ను వెంటనే అమలు చేయాలని, కాలుష్య పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫోరం కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. 2012లోనే పరిశ్రమ యాజమాన్యాలతో ప్రభుత్వం సమావేశం జరిపి కీలక నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసిందన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో మొత్తం 1545 పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 385 ఓఆర్‌ఆర్ వెలుపల ఉన్నాయి. మిగిలిన 1160 పరిశ్రమలు 803 రెడ్ కేటగిరీలో, 357 ఆరేంజి కేటగిరీలో ఉన్నాయి. వీటిని తరలించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, అటవీ పర్యావరణ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కాలుష్య పరిశ్రమలను తరలిస్తామని టీఎస్‌ఐఐసీ చాలా సార్లు ప్రకటనలు చేసిందన్నారు. కొత్తగా 8206 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 835 రెడ్ కేటగిరీ, 2315 ఆరెంజ్ కేటగిరీ, 5056 గ్రీన్ వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయని పరిశ్రమల అధికారులు చెప్పారన్నారు. ఈ పరిశ్రమలు శుద్ధి చేయకుండా విడుదల చేసిన విష పదార్థాలు హుస్సేన్ సాగర్‌లో కలుస్తున్నాయి. కాలుష్య నివారణకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలన్నారు. నగరంలో ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలకు తరలించాలన్నారు.