తెలంగాణ

418 మంది పోలీసులకు మెడల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట సేవలు అందించిన 418 మంది పోలీసు అధికారులకు ప్రభుత్వం పోలీసు మేడల్స్‌ను అందజేయనున్నది. ఈ క్రమంలో పోలీస్ శాఖలో విషేశమైన సేవలందించినందుకు గాను అంధించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యారెంటరీ (పీపీఎంజీ), పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎమ్), ముఖ్యమంత్రి మహోన్నత సేవా పతకాలు, ముఖ్యమంత్రి మహోన్నత పోలీస్ పతకం, శౌర్య పతకాలతో పాటు సేవా పతకాలు, ఉత్తమ సేవ పతకాలు, పోలీసు పతకాలు బహుకరించనున్నారు. రవీంద్ర భారతి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ మెడల్స్‌ను ప్రధానం చేస్తారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొంటారు.