తెలంగాణ

చైనీస్ మాంజాపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైనీస్ మాంజాను వినియోగించినా, అమ్మినా, నిలువ చేసినా ఐదేళ్లపాటు జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుందని రాష్ట్ర హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు. చైనా మాంజా అంశంపై చర్చించేందుకు అరణ్య భవన్‌లో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంక్రాంతి పండగ సమయంలో పతంగులను ఎగురవేసేందుకు చైనీస్ మాంజాను వినియోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజా తీవ్రమైన అనర్థాలకు దారితీస్తోందన్నారు. చైనీస్ మాంజా తయారీకోసం గ్లాస్ కోటింగ్ ఉన్న నైలాన్, సింథటిక్ తాడు వాడుతున్నారని, దాంతో పక్షులు అనేకం చనిపోతున్నాయన్నారు. చైనా మాంజా వల్ల ఇటీవలే దేశంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, రెండురోజుల క్రితం గుంటూరులో ఒక బాలుడి మెడకు చైనామాంజా చుట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడని శోభ గుర్తు చేశారు. పండగ తర్వాత ఎక్కడికక్కడ మాంజా వ్యర్థాలు మిగిలిపోయి దాంట్లో చిక్కుకుని పక్షలు చనిపోతున్నాయని, మనుషులు కూడా గాయపడుతున్నారని తెలిపారు. చైనా మాంజాను నిషేధించాలని 2017 జూలై 11 న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిందని ఆమె గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే చైనా మాంజా రవాణా, విక్రయం, నిలువ చేయడాన్ని, వినియోగించడాన్ని నిషేధించామని శోభ స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో సుమారు వెయ్యి కిలోల చైనా మాంజాను సీజ్ చేశామని పీసీసీఎఫ్ (అడ్మిన్) మునీంద్ర తెలిపారు. చైనామాంజా వాడకానికి సంబంధించి 123 కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ సమావేశంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, జంతు ప్రేమికులతో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా చైనా మాంజా అమ్మకం, నిలువ తదితరాల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే అటవీ శాఖ టోల్‌ఫ్రీ నెంబర్ 040-2323 1440, 1800 425 5364 నెంబర్లకు ఫోన్ చేయాలని అటవీ శాఖ సూచించింది.
'చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీఎఫ్ శోభ