తెలంగాణ

వేణుగోపాలుడిగా లక్ష్మీనరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జనవరి 7: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు వేణుగోపాలస్వామిగా, గోవర్ధగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాల రెండో రోజు దివ్యప్రబంధ పారాయణాల అనంతరం స్వామివారిని వేణుగోపాలస్వామి అలంకర సేవ నిర్వహించి బాల ఆలయంలో ఊరేగించారు. జీవులను ఉద్ధరించుటకు భగవానుడు దాల్చిన దశావతరాల్లో గొప్పదైన శ్రీ కృష్ణపరమాత్మ అవతారం. పరామాత్మ స్వరూపం, భగవత్ స్వరూపం, ఆచార్య స్వరూపంలతో పరిపూర్ణమైన భగవత్ స్వరూపానికి ప్రతీక వేణుగోపాలస్వామి అవతారం. శ్రీ కృష్ణ లీలలన్నింటిలో వేణుగోపాలుడి చేష్టలు మధురమైనవని, మురళీగానంతో గోకులాన్ని, పశు, పక్ష్యాదులను వశం చేసుకున్న వనమాలి సర్వబ్రహ్మండాన్ని వేణుగానంతో నియంత్రించాడని ప్రసిద్ధి.
గోవర్ధనగిరిధారి అవతారంలో ఊరేగింపు
అధ్యయనోత్సవాల్లో సాయంకాలం ద్రావిడ ప్రబంధ పారాయణం పిదప స్వామివారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ఊరేగించారు. భగవానుడు బృందావనంలో తన భక్తులను గోవర్ధనగిరి ధారిగా అనుగ్రహించడాన్ని దశమ స్కంధంలో అద్భుతంగా వర్ణించారు. గోకులంలో కరవు కాటకముల నివారణకు గోవర్ధనగిరి సమీపంలో వన పూజలు నిర్వహిస్తుండగా తనను కాదని కృష్ణుడిని పూజించుట సహించలేని ఇంద్రుడు రేపల్లె వాసులపై రాళ్ల వర్షం కురిపిస్తాడు. భక్తవత్సులుడైన శరణాగత త్రాణపరాయణుడైన శ్రీ కృష్ణ పరామాత్మ తన లీలతో చిటికన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి రేపల్లె వాసులను రక్షిస్తాడు.
తనపై భారం వేసి శరుణకోరిన వారందరికీ తానే రక్షకుడినంటూ గోవర్ధనగిరిధారిగా తన లీలతో రుజువు చేస్తాడు. గోవర్ధనగిరిధారి దర్శనంతో భక్తుల సర్వపాపహరణం, దైవ రక్షణ లభిస్తుందని పురాణ కథనం. అళ్వారులు తన్మయత్వంతో చెప్పిన గోవర్ధనగిరిధారి అవతార అలంకార సేవలో సకల సృష్టిజాలమంత తన సంకల్పబలం చేతనే వృద్ధి చెందుతుందనే తత్వం చాటుతుందని ఆయన దర్శన భాగ్యమంతో ప్రజలకు జగద్రక్షుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

'చిత్రం...అధ్యయనోత్సవాల్లో వేణుగోపాలస్వామి అలంకార సేవలో యాదాద్రి లక్ష్మీనరసింహుడు