తెలంగాణ

సార్వత్రిక సమ్మె విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు తెలంగాణలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. సమ్మెకు ఇన్సూరెన్స్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ఆర్‌బీఐ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించిన ఈ సమ్మె విజయవంతమైందని కార్మిక సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలూ పాల్గొన్నారని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ తదితర సంఘాలు పేర్కొన్నాయి. కార్మికుల డిమండ్లను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించినట్టు వారు చెప్పారు. విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా మరో 60 విద్యార్థి సంఘాలు , విశ్వవిద్యాలయాల సంఘాలు సైతం ఈ సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మె కారణంగా పలు రకాల సేవలు నిలిచిపోయాయి. దీంతో బ్యాంకులు పాక్షికంగానే పనిచేశాయి.
రాష్ట్రంలో సమ్మెకు వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో విజయవంతమైందని ఏఐటీయూసీ నేత ఎం నర్సింహా పేర్కొన్నారు. సమ్మె సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఐఎన్‌టీయూసీ నుండి ఆదిల్ షరీఫ్, ఎంవీ విజయకుమార్, ఏఐటీయూసీ నుండి వీఎస్ బోస్, ఎం నర్సింహా, సీఐటీయూ నుండి ఎం సాయిబాబా, కే ఈశ్వరరావు, ఐఎఫ్‌టీయూ నుండి ఎస్‌ఎల్ పద్మ, టీఎన్‌టీయూసీ నుండి ఎంకే బోస్, రత్నాకర్‌రావు, ఏఐటీయూసీ నుండి భరత్‌కుమార్, బాబూరావు, ఐఎఫ్‌టీయూ నుండి ముక్తార్ పాషా, అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు నిర్వహించి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు లాభం చేకూర్చే పద్ధతిలో కార్మిక చట్టాలను సవరించడాన్ని దేశవ్యాప్త సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నా కేంద్రం ప్రభుత్వం మాత్రం చట్టాన్ని తేవాలని చూస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యోగులు, కార్మికులను ఏఐటీయూసీ నేత వీఎస్ బోస్ అభినందించారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా మెడికల్ ఎంప్లారుూస్ యూనియన్ నేతలు అంతా సమ్మెలో పాల్గొన్నట్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహక అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు భీంరావు పాటిల్, హేమలత, ఎంసీఎన్ రాజు, దేవి తదితరులు పాల్గొన్నారని ఆయన చెప్పారు.
'చిత్రం... హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు కార్యాలయం వద్ద బుధవారం సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు