తెలంగాణ

పల్లెల అభివృద్ధే కేసీఆర్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, జనవరి 8: రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి చేయడమే తమ అధినేత, సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జరుగుతున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆయన బుధవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి పరిశీలించారు. తొలుత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తల్లి ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమ అమలును పరిశీలించేందుకు మరో పది రోజుల్లో మండలానికి రానున్నట్టు తెలిపారు. గ్రామసర్పంచ్‌ల ఆధ్వర్యంలో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో సర్పంచ్‌ల కుటుంబ సభ్యులు గర్వపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తమ అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు త్వరలో జరిగే పురపాలిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు తోడ్పతాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కోదాడలో టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రైతులకు ఇటీవల మంజూరైన ట్రాక్టర్‌లను మంత్రి దయాకర్‌రావు పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో ఎంపీపీ ఎల్కబిందు నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీళశ్రీనివాస్, ఎంపీడీవో ఉమారాణి, తహశీల్దార్ పాండునాయక్, గ్రామసర్పంచ్ చింతకాయల ఉపేందర్, ఎంపీటీసీలు ఉప్పుల రజిత, జానకిరెడ్డి, కాసర్ల కల్పన శ్రీనివాస్, నాయకులు నల్లపాటి శ్రీనివాస్, కందిబండ సత్యం, మండలపార్టీ అధ్యక్షుడు తొగరి రమేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఎస్.అజయ్‌కుమార్, ఉప్పల యుగేంధర్‌రెడ్డి, లక్యానాయక్, ముస్కుల సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... కార్యక్రమంలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్