తెలంగాణ

ఇంటర్‌లో కొత్తగా వృత్తి విద్యా కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ఇంటర్మీడియట్ విద్యలో కొత్తగా మరిన్ని ఉపాధి ఆధారిత వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. ఈ కొత్త కోర్సులను విజయవంతం చేసేందుకు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సహకరించాలని ఆయన సూచించారు. బుధవారం నాడు స్థానిక రూసా సమావేశ మందిరంలో జరిగిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం , ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ సంఘం నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనుగడలో లేని కొన్ని వృత్తి విద్యా కోర్సుల స్థానే కొత్తగా ఉపాధి ఆధారిత వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఈ కోర్సులను ఉన్నత విద్యకు అనుబంధంగా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో అధ్యయనం కోసం సెంచూరియన్ యూనివర్శిటీ నుండి ప్రత్యేక బృందాలు వస్తాయని, వారు అధ్యయనం చేస్తారని చెప్పారు. డైరీ ఆవిష్కరణ సందర్భంగా సంఘాల నేతలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో విద్య జాక్ చైర్మన్ డాక్టర్ పీ మధుసూధనరెడ్డి, ప్రిన్సిపాల్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్‌రావు, కే కృష్ణకుమార్, జేఎల్ నేతలు ఈ శ్రీనివాసరెడ్డి, కే లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.