తెలంగాణ

విద్యా సమస్యలపై సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ప్రాధమిక పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల పదోన్నతులు , అంతర్ జిల్లా బదిలీలు, కేజీబీవీ మోడల్‌స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నేతలు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కే జంగయ్య, చావ రవి, తదితరులు మంత్రిని కలిశారు. గత ఐదేళ్లుగా ప్రాధమిక పాఠశాలలలను పట్టించుకోవడం లేదని కనీసం ఇపుడైనా అభివృద్ధిపై దృష్టి పెట్టకుంటే చాలా స్కూళ్లు మూతపడే ప్రమాదం దాపురించిందని అన్నారు. ఉపాధ్యాయులు పదోన్నతులు, అంతర్‌జిల్లా బదిలీలపై రెండు నెలల క్రితమే సానుకూల నిర్ణయం తీసుకున్నా పురోగతి లేదని, ఐదేళ్లుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు లేక ఉన్నత పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. గురుకుల విద్యాలయాలతో సమానంగా పనిచేయిస్తూ కేజీబీవీ , యుఆర్‌ఎస్ సిబ్బందికి కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా, సెలవులు మంజూరు చేయకుండా వివక్ష చూపడం సమంజసం కాదని యూటీఎఫ్ నేతలు మంత్రికి వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన విద్యామంత్రి పదోన్నతులపై సాధారణ పరిపాలనాశాఖ అభ్యంతరం తెలిపిందని మరో మారు ప్రధాన కార్యదర్శితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ అభ్యంతరాన్ని పరిష్కరించాలని పాఠశాల విద్యా శాక కార్యదర్శికి సూచించినట్టు తెలిపారు.
*చిత్రం...మంత్రి సబితా రెడ్డిని కలిసిన యూటీఎఫ్ నేతలు