తెలంగాణ

యువజన సంఘాలు ఎన్‌వైకేలో అనుసంధానం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 3 : కొండపాక పరిసర గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలు నెహ్రూ యువ కేంద్రాలతో అనుసంధానం చేసుకోవాలని ఎన్‌వైకే జిల్లా కోఆర్టీనేటర్ బిన్సీ అన్నారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో నెహ్రూ యువక కేంద్రం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ క్లబ్ డెవలప్‌మెంట్ కనె్వన్షన్ కార్యక్రమంలో ఎన్‌వైకే జిల్లా కోఆర్డినేటన్ బిన్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 18 ఏళ్ల్లు నిండిన, 29 సంవత్సరాల లోపు ఉన్న యువకులు నూతన యువజన సంఘాల స్థాపన, యువజన సంఘాల సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాత యువజన సంఘాల వివరాలు నెహ్రూ యువక కేంద్రంలో అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్లటంలో యువత ముందుండాలన్నారు. స్వచ్ఛ భారత్ 100 గంటల కార్యక్రమాన్ని యువజన సంఘాలు చేయాలని సూచించారు. నెహ్రూ యువక కేంద్రం ప్రతి సంవత్సరం యువజన సంఘాలు నాయకత్వ నైపుణ్య వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తుందన్నారు. స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ నిర్వహించారు. నెహ్రూ యువక కేంద్రం ప్రతినిధి కిరణ్‌కుమార్,వాలంటీర్లు నర్సింలు, విజయ్, దొమ్మాట రాజు, సిద్దిపేట జిల్లా కబడ్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.