ఆంధ్రప్రదేశ్‌

ఆరేళ్లు నిండినా అమలు కాని ‘హోదా’ హామీ: తులసిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ హామీ ఇచ్చి గురువారానికి ఆరేళ్లు నిండాయని, అయినా ఇప్పటి వరకు ఆ హామీ అమలు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి తప్పుబట్టారు. ప్రత్యేకహోదా వల్లే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, అదే ఈ రాష్ట్రానికి సంజీవని అని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని పదవిలో ఉన్న మన్‌మోహన్‌సింగ్ రాజ్యసభలో ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించగానే బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఐదు కాదు 10 ఏళ్లు ఇస్తామన్నారన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో 10 ఏళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చి మరీ రాష్ట్రానికి ద్రోహం, మోసం చేసింన్నారు. 2014 ఫిబ్రవరి 20వ తేదీ పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ఆరు ప్రకటనలు చేసారని తులసిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, పన్నుల మినహాయింపు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు, కొత్త రాష్ట్ర అవతరణ తేదీ ప్రకటన, 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీలను రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు.