గుంటూరు

అత్యాచార బాధితులకు వెంటనే పరిహారం అందజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 23: అత్యాచార బాధితులకు ప్రభుత్వం సత్వర పరిహారం అందించాలని ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందరబాబు డిమాండ్ చేశారు. ఇద్వా ఆధ్వర్యంలో సోమవారం జెడ్పీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా రాజసుందరంబాబు మాట్లాడుతూ అంబేద్కర్, ఇద్వా మహానగర్, పెదమక్కెన, ఒప్పిచర్ల గ్రామాలకు చెందిన అత్యాచార బాధితులకు చట్టప్రకారం అందించాల్సిన పరిహారాలను అందించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. 2004 సంవత్సరంలో ఇద్వానగర్‌లో అగ్రవర్ణాలు జరిపిన వరుస దాడుల్లో ఇళ్లు కోల్పోయిన 400 మంది బాధితులకు ఇళ్లస్థలాలు చూపాలని జిల్లా కలెక్టర్ గుంటూరు మండల తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేయగా నేటికీ స్థలం చూపించక పోవడం నిర్లక్ష్యమేనన్నారు. ఇద్వానగర్ విషయంలోనూ సంబంధిత శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆదేశాలను కూడా అధికారులు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పెదమక్కెన, ఒప్పిచర్ల గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు జరిగి 13 సంవత్సరాలు గడిచినా ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రకారం బాధితులకు అందించాల్సిన ఆర్థిక, పునరావాసాలు నేటికీ అందకపోవడం దారుణమన్నారు. ఒప్పిచర్లలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిని కొందరు ఆక్రమిస్తే విచారణ నివేదికలు భూమిని తిరిగి దళితులకు ఇవ్వాలని, పిఒటి చట్టం 1977 కింద సిఫారసులు జరిగినా ఆర్డీవో ఒత్తిడిలకు లొంగి ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అనంతరం జిల్లా అధికారులకు రాజసుందరంబాబు, ఇద్వా అధ్యక్షురాలు బేతపూడి భారతి తదితరులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డి వెంకటరత్నం, వీరమ్మ, నానమ్మ, సువార్త, పౌలు, అరుణ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌తో కలిసి రాజకీయం..
* స్వామి స్వరూపానందేంద్రపై శిరిపురపు శ్రీధర్ ధ్వజం
గుంటూరు, మే 23: రాష్ట్రప్రభుత్వం బ్రాహ్మణులను మోసం చేస్తుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వైసిపి అధినేత జగన్‌తో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి బ్రాహ్మణ చైతన్య వేదిక కోకన్వీనర్ శిరిపురపు శ్రీ్ధర్ ఖండించారు. సోమవారం నగరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్వామి స్వరూపానందేంద్ర చెపితే చంద్రబాబునాయుడు పెట్టలేదని, రాష్టవ్య్రాప్తంగా పాదయాత్రలు చేసి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. 2014-15 సంవత్సరంలో 65 కోట్లు, 2015-16లో 60 కోట్లు బడ్జెట్ కేటాయించి, తద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు, వివిధ కోర్సుల కోచింగ్‌లలో పెన్షన్, ఆరోగ్యబీమా ద్వారా పేద బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధిచేకూరేలా ఇప్పటివరకు 11,125 మందికి 31.5 కోట్లు ఖర్చుచేయడం జరిగిందన్నారు. 20 కోట్లతో బ్రాహ్మిన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారని, 13 జిల్లాల్లో కార్పొరేషన్ ద్వారా 45 అవగాహన సదస్సులు నిర్వహించారని, రాజకీయాలకు అతీతంగా కార్పొరేషన్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై స్వామిజీలు చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేయకుండా విమర్శలు చేయడం సబబు కాదన్నారు. గత ప్రభుత్వాలను స్వరూపానందేంద్ర బ్రాహ్మణ సమస్యలపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. స్వామీజీలనే వారు ఆధ్యాత్మిక విషయాలు, హిందూ మతప్రచారం చేయాల్సి ఉండగా రాజకీయాలు మాట్లాడటం తగదన్నారు. జగన్‌పైన ప్రేమ ఉంటే స్వామీజీ ముసుగును పక్కనబెట్టి బహిరంగ రాజకీయాల్లోకి రావాలే తప్ప ఇలాంటి దుష్ప్రచారం స్వామీజీ రూపంలో చేయడం సరికాదన్నారు. సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు మత్తెనపల్లి ప్రసాద్, తుళ్లూరు ప్రకాష్, కోనంకి మారుతి, గుండు జ్ఞానేశ్వర్, యలమర్తి లక్ష్మీనారాయణ, నేపాక పద్మావతి, వేదాంతం హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.