బిజినెస్

అంతర్జాతీయ విమానాశ్రయంగా తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: వౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా అన్ని రంగాల్లోనూ రాష్ట్భ్రావృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గడచిన రెండేళ్లుగా రాష్ట్రంలో విమానయాన ప్రయాణికుల శాతం అనూహ్యంగా పెరుగుతున్నదంటూ 2014-15లో 17 లక్షల 80వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తే, 2015-16 లో 28 లక్షల 40వేల మంది ప్రయాణించారని తెలిపారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి కనీసం రెండువేల ఎకరాల భూమి అవసరంగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వపరంగా మంచి ప్యాకేజీ ఇస్తుండటంతో తమ భూములను ఇచ్చేందుకు రైతులు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇక తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చి నేరుగా అమెరికా, దుబాయ్ వంటి పాశ్చాత్య దేశాలకు విమానాలు వెళ్లేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాజమండ్రిలో రన్‌వే విస్తరణ కోసం 350 కోట్ల రూపాయ లు ఖర్చు చేయనున్నామని, గన్నవరం విమానాశ్రయానికి సైతం అంతర్జాతీయ హోదా లభించేందుకుగాను రన్‌వే విస్తరణ కోసం భూసేకరణ జరుగుతున్నదన్నారు. పుష్కరాల నాటికి కొత్త టెర్మినల్ అందుబాటులోకి రాగలదన్నారు. ప్రస్తుతం కడప నుంచి విజయవాడ, తిరుపతి, బెంగళూరుకు విమానాలు నడుస్తున్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాగర్తి, ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్‌లలో చిన్నస్థాయి విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. వీటికి కేంద్రం నుంచి 80 శాతం ఆర్థిక సహాయం లభించగలదంటూ 2018 నాటికి ఇవి పూర్తి కాగలవన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అనంతపురంలో ఎనర్జీ, కాకినాడలో లాజిస్టిక్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.
ప్రతి ఇంటికి ఫైబర్ కేబుల్ కనెక్షన్
ప్రతి ఇంటికి ఫైబర్ కేబుల్ కనెక్షన్ ద్వారా టివి, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించేందుకు 22వేల కిలోమీటర్ల మేర కేబుల్ లైన్ వేయాల్సి ఉండగా, ఇప్పటికి 15వేల కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తయిందని, ప్రతి ఒక్కరూ విధిగా సెటాప్ బాక్స్ కొనుగోలు చేయాల్సి ఉందంటూ వీటి తయారీ కోసం చైనా సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని జైన్ తెలిపారు. 9వేల మంది ఎంఎస్‌వో, ఎల్‌సివోలలో ఇప్పటికే 5,400 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. కాకినాడ-శ్రీకాకుళం మధ్య గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, ప్రతి ఇంటికి పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని అన్నారు. అలాగే కొత్త ఓడరేవు ల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. విలేఖరుల సమావేశం లో కాకినాడ, మచిలీపట్నం పోర్టు డైరె క్టర్ రవికుమార్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎండి వెంకటేశ్వరరావు, ఎనర్జీ సిఇఒ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.
విలేఖరులతో మాట్లాడుతున్న అజయ్‌జైన్

30 నుంచి పెట్రోల్
ట్రక్ యజమానుల సమ్మె

హైదరాబాద్, మే 24: ట్రాన్స్‌పోర్ట్‌పై 5 శాతం పన్ను, 14.5 శాతం వ్యాట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 30 నుంచి పెట్రోల్ ట్రక్ యజమానులు నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. పెట్రోలియం ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్ట్‌పై 5 శాతం పన్నును 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలోనే విధించడమైందని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించడం సమంజసం కాదన్నారు. తాము ఉత్పత్తిదారులమూ కాదు.. వినియోగదారులమూ కాదు.. కేవలం పెట్రోల్ సరఫరాదారులమేనన్నారు. 14.5 శాతం వ్యాట్ పరిధిలోకి ఎందుకు తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు.