ఆంధ్రప్రదేశ్‌

ఉనికి కోసమే ముద్రగడ లేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన రాజకీయ ఉనికి కోసమే లేఖలు రాస్తున్నాడంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు ఆడిస్తున్న నాటకంలో ముద్ర కూడా కీలుబొమ్మ అంటూ ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్‌పై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాపు జాతికి నష్టం కల్గించేలా ముద్రగడ మాట్లాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. కాపు రిజర్వేషన్‌లపై ముద్రగడ్డ గతంలో ఎన్నడూ వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రశ్నించలేదని అన్నారు. కాపు రిజర్వేషన్‌లకు తమ ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. ముద్రగడ వాడుతున్న భాష అభ్యంతరంగా ఉందన్నారు. కాపు గర్జన సమయంలో కరుణాకరరెడ్డితో ముద్రగడ ఎందుకు సమావేశమయ్యారని ప్రశ్నించారు. కాపు గర్జన హింసకు ఎవరు కారణమని అన్నారు. పథఖాలకు తన పేరు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుకు లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ తుని ఘటనకు ముందు వైసిపి మాజీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డితో ముద్రగడ మాట్లాడినట్లు నిరూపిస్తామని ఛాలెంజ్ చేశారు. సిఐడి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్య తీసుకోగలమన్నారు.