ఆంధ్రప్రదేశ్‌

టిడిపిని రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిన టిడిపి ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం సేకరించి, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస సమన్వయ కమిటీ తీర్మానించిందని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం జరిగిన పిసిసి సమన్వయ కమిటీ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల టిడిపి, బిజెపి ప్రభుత్వాల హయాంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాజకీయ కక్షతో లక్షలాది మంది అర్హులైన వారికి రుణమాఫీ అమలు చేయలేదని, పింఛన్లు అందజేయలేదని, వాటిపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతల బృందం పరిశీలించి, జాబితా రూపొందించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేంతవరకు ఉద్యమం కొనసాగించాలని, వర్షాకాల సమావేశాల్లో ఎంపి కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు మద్దతు కూడగట్టేందుకుగాను అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళాలని నిర్ణయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని అటవీ, బాక్సైఢ్ దోపిడీ జీవోలను రద్దు చేయాలని, కేంద్రం ఇచ్చిన అన్ని అనుమతులను ఉపసంహరించుకోవాలని తీర్మానించామని తెలిపారు. తెలంగాణలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు ఏపిలోని పార్టీల అనుమతులు అవసరం లేదంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానించామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు భయపడవచ్చనీ, కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులు నిలుపుదల చేసేంత వరకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జి తిరునావక్కరాస్, రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కిల్లి కృపారాణి, కనుమూరి బాపిరాజు, డాక్టర్ తులసిరెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి నరసింహరావు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, రాజ్యసభ సభ్యులు చిరంజీవి గైర్హాజరయ్యారు. సమావేశానికి ఎఐసిసి ఎస్సీసెల్ చైర్మన్ కొప్పులరాజు, కోర్ కమిటీ సభ్యులు కెవిపి రామచంద్రరావు, డాక్టర్ సి రామచంద్రయ్య, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, జెడి శీలం, చెంగల రాయుడు, దేవినేని నెహ్రూ తదితరులు హాజరయ్యారు.