మహబూబ్‌నగర్

ప్రముఖ కవి, పరిశోధకులు కపిలవాయికి రాష్టస్థ్రాయి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మే 31: రాష్ట్రంలో వివిధ రంగాలలో చేసిన సేవలను గుర్తించి అవార్డులను ప్రకటించగా, సాహిత్య రంగంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన ప్రముఖ కవి, పండితులు, పరిశోధకులైన కపిలవాయి లింగమూర్తికి(88) అవార్డును ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ అవార్డును అందించనున్నట్లు కపిలవాయికి ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. కపిలవాయి లింగమూర్తికి రాష్టస్థ్రాయి అవార్డు రావడం పట్ల సాహితి అభిమానులు, జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన వారు పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో 1928, మార్చి 31న మాణిక్యమ్మ,వెంకటాచలం దంపతులకు కపిలవాయి లింగమూర్తి జన్మించారు. 1954లో నాగర్‌కర్నూల్‌లో జాతీయోన్నత పాఠశాలలో పండితునిగా చేరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం. ఒయల్ (తెలుగు) పూర్తి చేసిన లింగమూర్తి పాలెంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకులుగా 13సంవత్సరాలు పనిచేశారు. ఒకవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో తనదైన శైలిలో నడిపించారు. కవితలు, గీతాలు, వచనలు, శతకాలు, వచన శతకాలు, కావ్యాలు, ద్విపద, నాటకం, ఉదాహరణలు, స్థల చరిత్రలు, బాల సాహిత్యం మొదలగు ప్రక్రియలలో రచనలు చేశారు. మరుగున పడ్డ తాళపత్రాలను వెలికితీసి దానిలోని వ్యాఖ్యా విశేషాలను వివరిస్తూ పరిష్కరిస్తూ అనాటి తరం కవులను ఈ తరానికి పరిచయం చేశారు. జిల్లా అంతటా పర్యటించి మరుగున పడిన శాసనాలు, చరిత్ర, జానపదుల నోళ్ళలో నానే అపూర్వమైన విలువైన విషయాలను గ్రంథస్తం చేశారు. ఆయన ప్రచురించిన గ్రంథాలలో భాగవత కథాతత్వం, సాలగ్రామశాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, మాంగళ్యశాస్త్రం, స్వర్ణశకలాలు, ఆర్యశతకం, ఇలా అనేకం ఉన్నాయి. చాలా పుస్తకాలు టిటిడి, తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో వెలుగులోకి వచ్చాయి. ఎమెస్కో పబ్లిషర్స్ టిటిడి కూడా రచనలను ప్రచురితం చేసింది. ఇంకా 25విలువైన అముద్రిత గ్రంథాలు వెలుగులోకి రావాల్సి ఉన్నది. ఓయూ, తెలుగు యూనివర్సిటి, మధురై యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలలో కపిలవాయి లింగమూర్తి పుస్తకాలు సాహిత్యంపై ఆరుగురు పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాను పోందారు. కపిలవాయి లింగమూర్తికి అనేక పురస్కారాలు లభించాయి. గవర్నర్ కృష్ణాకాంత్, మాజి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వై ఎస్ రాజశేఖర్‌రెడ్డిలతోపాటు పలువురు ప్రముఖులు కపిలవాయిని సన్మానించి పలు బిరుదులు అందజేశారు. దశాబ్ది ఉత్సవాలలో సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసి ఆర్ కపిలవాయిని సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య రంగంలో అవార్డు ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కపిలవాయికి అవార్డు పట్ల ఎమ్మెల్యే హర్షం

తెలంగాణ గర్వించే ప్రముఖ కవి, పండితులు, పరిశోధకులైన కపిలవాయి లింగమూర్తికి రాష్టస్థ్రాయి అవార్డు రావడం పట్ల స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

తాగునీటి సమస్య పరిష్కారానికై ఎమ్మెల్సీ ఘెరావ్
నాగర్‌కర్నూల్, మే 31: పట్టణంలోని 15వ వార్డులోని కొన్ని కాలనీలలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఉందని, తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆ వార్డులోని వివిధ కాలనీల ప్రజల మంగళవారం నగరపంచాయతీ సమావేశం హాల్‌లో బైఠాయించారు. అంతకుముందు నగరపంచాయతీ చైర్మన్ మోహన్‌గౌడ్‌తో ఆయా కాలనీలకు చెందిన ప్రజలు మంచినీటి సమస్యతోపాటు కాలనీలో సరైన మురుగునీటి కాలువలు లేవని, వీధిలైట్లు సైతం సక్రమంగా లేదని వాపోయారు. తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడంతో చైర్మన్ రెండు రోజులలో సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. కాని వారు వినకుండా సమావేశం హాల్‌లోకి జొరబడి హాల్‌లో ఉన్న కుర్చీలను బయటవేసి మా సమస్య పరిష్కారమయ్యే వరకు సమావేశం జరగనివ్వమని, కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు సమావేశం హాల్‌లో బైఠాయించారు. దీనితో కౌన్సిలర్లు హబీబ్, ఎలిమె సత్యంతోపాటు మరికొందరు వారితో చర్చించిన ఫలితంలేకుండా పోయింది. నగరపంచాయతీ కమిషనర్ పూర్ణచందర్, మేనేజర్ బస్వరాజుసైతం మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించడం జరిగిందని, రెండు రోజులలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కాని, ఇలా ఎన్నోమార్లు హామీ ఇచ్చారని, నేటికి ఆ హామీ నెరవేరలేదని, సమస్య పరిష్కారమయ్యే వరకు కదిలేదిలేదని స్పష్టం చేశారు. చివరకు కాలనీకి వచ్చి పరిశీలిస్తామని హామి ఇవ్వడంతో వారంతా కూడా హాల్ నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిని ప్రధాన గేట్ వద్దనే ఘేరావ్ చేసి తాగునీటి సమస్యపై నిలదీశారు. పాలకమండలి సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, అవసరమైతే ఎమ్మెల్సీ నిధులతోనైనా సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటానని హామి ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.

రాష్ట్ర అవతరణను ఘనంగా జరుపుకోవాలి
* సెట్మా సిఇఓ హన్మంతురావు

ధన్వాడ, మే 31: జూన్ 2న ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంను ప్రతి గ్రామపంచాయతి కార్యాలయలలో ఘనంగా జరుపుకోవాలని సెట్మా సిఇఓ హన్మంతురావు అన్నారు. మంగళవారం ధన్వాడ మండలంలోని చర్లపల్లి గ్రామంలో పల్లేవికాసం కార్యక్రమానికి జిల్లా సెట్మా సిఇఓ హన్మంతురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి జిల్లా సెట్మా సిఇఓ హన్మంతురావు మాట్లాడుతూ ధన్వాడ మండలంలోని 19 గ్రామపంచాయతి కార్యాలయాల ఆధ్వర్యంలో జూన్ 2న గ్రామపంచాయతి కార్యాలయాలకు మామిడి తోరణలను ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లకు తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని ప్రతి వార్డులలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పంచాయతి కార్యదర్శులను కోరారు. అదేవిధంగా గ్రామపంచాయతి భవనాలకు రంగులు, సున్నలుగాని వేయించాలని ఆయన సర్పంచులను కోరారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు జూన్ 2న స్వీట్ల పంపిణీ కార్యక్రమంను నిర్వహించాలని మండల ఉపాధిహామి పథకం ఎపిఓ మొగులయ్యను కోరారు. అనంతరం గ్రామంలో బడికి రాని బడిబయటి విద్యార్థులను బడిలో చేర్పించాలని మండల ఎంపిడిఓ శశికళ, ధన్వాడ మండల తహశీల్దార్ శంకరయ్యచారిలు తల్లిదండ్రులను కోరారు. గ్రామంలో ఇంకుడు గుంతలు ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకునేల ఉపాధిహామీ పథకం అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. గ్రామంలో నేటికి గ్యాస్ సిలిండర్లు అందలేదని గ్రామసర్పంచ్ మల్లప్ప అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అందుకు మండల ఎంపిడిఓ శశికళ మాట్లాడుతూ చర్లపల్లి గ్రామానికి సిలిండర్లు అందేలా చుస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల ఎంపిడిఓ శశికళ, మండల తహశీల్దార్ శంకరయ్యచారి, మండల పశువైధ్యధికారి స్పూర్తి, మండల ఆర్‌డబ్ల్యూఎస్ వర్కు ఇన్పిస్పేక్టర్ స్వాతి, చర్లపల్లి గ్రామసర్పంచ్ మల్లయ్య తదితరులు ఉన్నారు.