కృష్ణ

పూర్తి స్థాయిలో రెవెన్యూ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: రాష్ట్రంలో రెవెన్యూ సర్వీసులను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు సిసిఎల్‌ఎ కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి మంగళవారం జిల్లాలోని జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డివోలు రెవెన్యూ యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగ్ పిటిషన్లను, ముఖ్యమంత్రి కార్యాలయ గ్రీవెన్స్ జన్మభూమి పిటిషన్ల ప్రగతిని సమీక్షించారు. భూ సంబంధ ఫిర్యాదుల పరిష్కారంలో సివిల్ కోర్టు కేసులు మినహా మిగిలిన అన్ని ఫిర్యాదులను జూన్ 15కల్లా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేసారు. జూన్ 27న గొల్లపూడిలో సిసిఎల్‌ఎ రాష్టస్థ్రాయి కమిషనరేట్ కార్యాలయాన్ని గొల్లపూడిలో ఏర్పాటు చేస్తున్నట్లు అనిల్‌చంద్ పునీత్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన డివిజన్‌వారి, మండలవారి, గ్రామాలవారి పెండింగ్ ఫిర్యాదుల వివరాలు సిఎం ‘డాష్’ బోర్డులో తెలియజేయడం జరుగుతోందని అనుకనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.