మహబూబ్‌నగర్

ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన కొండకోనల నడుమ అనే గేయంతో నిర్వహించిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. నిజాలపూర్ గ్రామానికి చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కత్తుల బల్లెం చేతబట్టి అనే పాటతో చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకర్షించాయి. నల్లమల్ల అటవి ప్రాంతంలోని చెంచుపెంటల విద్యార్థులు నిర్వహించిన చెక్క్భజన సైతం ఆకర్షినీయంగా నిలిచింది. కల్వకుర్తికి చెందిన అక్షర వనం విద్యార్థులు నిర్వహించిన చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి కుల వృత్తులకు సంబంధించిన పాటతో చేసిన కుల వృత్తుల విన్యాసాలు అందరిని అబురపర్చాయి. తెలంగాణలోని ప్రతి కుల వృత్తిని ఈ పాటలో జోడించి నృత్యాలు నిర్వహించడంతో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేలాది మంది జనం చప్పట్లతో హర్షధ్వానాలను వినిపించారు. వీరందరికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు.