మహబూబ్‌నగర్

కెసిఆర్‌ది రెండు నాల్కల ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 2: ముఖ్యమంత్రి కెసిఆర్‌ది రెండు నాలుకల ధోరణి అని, ఆయన తెలంగాణ వచ్చిన వెంటనే కుటుంబంతో సహా సోనియాగాంధీని డిల్లీలో కలసి తీరా హైదరాబాద్‌కు వచ్చాక తానే తెలంగాణ తెచ్చానని, తన ద్వారానే తెలంగాణ వచ్చిందని మాటమార్చిన నీతిమాలిన రాజకీయ నాయకుడని టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ మల్లురవి ఆరోపించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రెండేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, నియంతృత్వ చీకటి పాలనలో బాధల తెలంగాణ, బేజారవుతున్న జనం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ 2013లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తెలంగాణ పట్ల నిర్ణయం తీసుకోవడంతోనే తెలంగాణ రాష్ట్రం అప్పట్లోనే సాధ్యమైందని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదానికి మార్గం సుగమమైందని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే కెసిఆర్ జేజమ్మ దిగిన తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ గుర్తించి, అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన మహానాయకురాలు అని అన్నారు. డిల్లీలో సోనియాగాంధీని దేవతగా కొల్చిన కెసిఆర్ హైదరాబాద్ రాగానే రాజకీయ లబ్దికోసం నైతిక విలువలను వీడి రెండు నాలుకల ధోరణితో వ్యవహరించాడని అన్నారు. కెసిఆర్ నిజాయితీ లేని మనిషి అని, ఆయన మాట మీద ఉండే వ్యక్తి కాదని విమర్శించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశ పెట్టుకుంటే టిఆర్‌ఎస్ పార్టీలోని నిరుద్యోగులకు మాత్రం పదవులు వచ్చాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కెసిఆర్ పాలనలో ప్రచారం ఆర్భాటంగా ఉందని, అభివృద్ది మాత్రం తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథలో అవినీతి చోటుచేసుకుందని, ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న మిషన్‌కాకతీయ పనులపై ఆఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పనులను పరిశీలించే విధంగా పర్యటనను ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. తన హయాంలో అవినీతే లేదని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా రాజకీయ అవినీతి తెలంగాణలో జరుగుతుందని, ఇది నిరూపిస్తామని సవాల్ విసిరారు. జడ్పిచైర్మన్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపిటిసి, జడ్పిటిసిలకు లక్షల రూపాయలు ఇచ్చి అవినీతికి పాల్పడి ఓట్లు వేసుకున్నది అవినీతి కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా కోట్లాది రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తెస్తామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో డిసిసి అధ్యక్షులు ఉబేదుల్లా కొత్వాల్, నాయకులు చంద్రకాంత్‌గౌడ్, పటేల్ వెంకటేష్ పాల్గొన్నారు.