విజయనగరం

బ్యాంక్ మేనేజర్‌ని.. నటుడిగా మారా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూన్ 2: టివి సీరియల్స్, చలనచిత్రాల్లో సందేశాత్మకం కొరవడిందని, కేవలం వినోదానికే పరిమితమయ్యాయని ప్రముఖ సినీ నటుడు, నాటక రచయిత కోట శంకరరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురువారం బొబ్బిలిలో ఓ నాటకం ప్రదర్శించడానికి వచ్చిన ఆయన స్థానిక లోకబంధు రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు నాటకరంగం ఎంతో సంతృప్తి ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించినట్టు తెలిపారు. అప్పటికే తన సోదరుడు కోట శ్రీనివాసరావుచలన చిత్రరంగంలో మంచిపేరు సాధించినట్లు వెల్లడించారు. తాను బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తూ నాటకరంగంలోకి వచ్చినట్టు తెలిపారు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించినట్టు తెలిపారు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో నటించినట్టు చెప్పారు. వీటిలో మూడు సీరియల్స్‌కు నంది అవార్డులు లభించినట్టు తెలిపారు. ఎక్కువగా నాగులు తిరిగే కోనలో, హర హర మహదేవ, రసరాజ్యం తదితర నాటకాలకు మంచి పేరు లభించినట్టు చెప్పారు. అలాగే శ్రీమతి, గాయిత్రీ, జీవన సంధ్య సీరియల్స్‌లో మంచి గుర్తింపు లభించినట్టు వెల్లడించారు. కళాకారులకు తప్పనిసరిగా అదృష్టం ఉండాలని లేని పక్షంలో రాణించడం కష్టమన్నారు. కష్టపడే తత్వం ఉంటే అన్ని రంగాల్లోని రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు.