కృష్ణ

రాష్ట్భ్రావృద్ధికి పునరంకితవౌదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 2: కుల, మత, ఆర్థిక అసమానతలను పక్కన పెడదాం.. చెయ్యిచెయ్యి కలుపుదాం.. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునరంకితవౌదాం.. అంటూ జిల్లా ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జిల్లా అంతటా నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార, అనధికార వర్గాలతో పాటు సామాన్య ప్రజలు నవ నిర్మాణ దీక్షలో పాల్గొని రాష్ట్భ్రావృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని దిగమింగి క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతతో నవ్యాంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌లో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సీతారాం కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కూడా నవ నిర్మాణ దీక్ష చేశారు. జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ బివిడి సాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని నవ నిర్మాణ దీక్ష చేయించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ పి జయరాజు, డిసిఆర్‌బి డిఎస్పీ ఎం రమేష్, ఎఓ బి వెంకటయ్య, ఆర్‌ఐలు కృష్ణంరాజు, నాగిరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు శ్రీనివాస్, సతీష్, రమేష్, శివరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఎపిఆర్‌ఓ శ్రీనివాసరావు కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ ముఖ్యకూడలి కోనేరు సెంటరులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రిపాటి గోపిచంద్, బూరగడ్డ రమేష్‌నాయుడు, ఇలియాస్ పాషా, వంపుగడల చౌదరి, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, తహశీల్దార్ నారదముని, తదితరులు పాల్గొన్నారు. ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నవ నిర్మాణ దీక్ష చేపట్టి రాష్ట్భ్రావృద్ధికి మేము సైతం అంటూ ప్రతిజ్ఞ చేశారు.