కృష్ణ

పొందుగల బిజెపి అధ్యక్షునిగా నాగరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 2: మండలంలోని పొందుగల గ్రామ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఆరేపల్లి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ కన్వీనర్ పి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వజ్రాల వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈమేరకు కమిటీని ఎన్నిక చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం కార్యదర్శిగా సంకటి ఏసు, కోశాధికారిగా వంగూరి పనే్నరు, సభ్యులుగా నూతక్కి ఏసు, బాబు, బోడే నాగేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన సభ్యులంతా క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని, ఆయన బాటలోనే అందరూ పయనించాలన్నారు. అనేక సంక్షేమ పథకాల అమలుతో ఆదర్శవంతమైన పాలనకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. అదేవిధంగా రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన నిధులను అందిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. కార్యక్రమంలో శివారెడ్డి, వశ్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.