కృష్ణ

జ్యూయలరీ పార్కు, ఆటోనగర్‌లో వౌలిక సదుపాయాలు కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 2: పోతేపల్లి జ్యూయలరీ పార్కు, ఆటోనగర్‌లో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం స్థానిక జ్యూయలరీ పార్కు అసోసియేషన్ సమావేశపు హాలులో ఎపిఐఐసి చైర్మన్ పి కృష్ణయ్యతో కలిసి జ్యూయలరీ పార్కు, ఆటోనగర్ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రధాన సమస్యగా మారిన మంచినీరు, రహదారులు, డ్రైనేజీ, తదితరాల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని రోల్డుగోల్డు, ఆటోనగర్ యూనిట్లన్నీ సత్వరమే ఇక్కడకు వచ్చి యూనిట్లు నెలకొల్పుకోవాలని కోరారు. మంచినీటి సమస్య పరిష్కారానికి కోటి రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. జ్యూయలరీ పార్కు ప్రధాన రహదారిని కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామని తెలిపారు. రహదారి పక్కనున్న డ్రైనేజీని తాళ్ళపాలెం డ్రైన్‌లో కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీరు-చెట్టు పథకం కింద పోతేపల్లి పంచాయతీ పరిధిలోని చెరువుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జెడ్పీ సెంటర్ నుండి జ్యూయలరీ పార్కును కలిపే విధంగా నేరుగా రహదారి ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జ్యూయలరీ ఉత్పత్తులు మార్కెటింగ్ సమస్యలు, పన్నుల చెల్లింపు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి రవీంద్ర హామీ ఇచ్చారు. ఎపిఐఐసి చైర్మన్ పి కృష్ణయ్య మాట్లాడుతూ జ్యూయలరీ పార్కు యూనిట్‌దారులంతా తమ ఉత్పత్తులకు తగిన ప్రచారం కల్పించుకుని మార్కెటింగ్ అవకాశాలు వినియోగించుకోవాలని కోరారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా (ఐలా) చట్టం ఏర్పాటుకు నోట్‌ఫై చేస్తామన్నారు. జ్యూయలరీ పార్కు అసోసియేషన్ అధ్యక్షులు పి వెంకట సుబ్బారావు, ఆటోనగర్ సంఘం అధ్యక్షులు సాయిబాబు తమ సమస్యలను మంత్రి, ఎపిఐఐసి చైర్మన్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఆర్డీవో సాయిబాబు, టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, తహశీల్దార్ బి నారదముని, ఎంపిడివో జివి సూర్యనారాయణ, జ్యూయలరీ పార్కు అసోసియేషన్ ప్రతినిధులు చలమలశెట్టి నరసింహరావు, పంచపర్వాల సత్యనారాయణ, మట్టా శ్రీను, టిడిపి నాయకులు కుంచే నాని, ఎ రాజా పాల్గొన్నారు.