రాష్ట్రీయం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 2: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్స 2వ వార్షికోత్సవ సంబురాలు సందడిగా జరిగిన నేపథ్యంలో ఖమ్మంలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. ఒక దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో టిఆర్‌ఎస్, సిపిఐ కార్యకర్తలు గొడవలకు దిగడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయాల పాలయ్యారు. గ్రామంలో ఒక వైపు ఆవిర్భావ దినోత్సవాలు మరో వైపు సిపిఐ నేత శ్రీనివాస్ సంస్మరణ సభ జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య ఏర్పడిన చిన్న వివాదంతో పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌కు చెందిన కత్తి సంగం(60) గాయాలు పాలుకాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. అలాగే తెలంగాణ ఉద్యమంలో తన కుమారుడు ప్రాణం త్యాగం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నల్గొండ జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన సుగుణమ్మ ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమారుడు రావుల సుధాకర్‌రెడ్డి పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ సకలజనుల సమ్మెలో చురుకుగా పాల్గొని ప్రాణత్యాగం చేశాడని గుర్తు చేసింది. తన కొడుకుపైనే తన కుటుంబం ఆధారపడి ఉందని, తన కుమారుడిని అమరవీరుడిగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ్మలను కలిసిన అనంతరం డొమెక్స్ సిరప్‌లో ఎండ్రిన్ కలుపుకొని తాగింది. తెలంగాణ కోసం తన కుమారుడు అమరుడైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది.