కరీంనగర్

బడుగుల్లో ‘జూన్’ పీవర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 3: బడుగుల్లో జూన్ మాసం ఫీవర్ మొదలైంది. పది రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న దరిమిలా పిల్లల చదువుల ఫీజులు, సరంజామాను సమకూర్చడంపై తల్లిదండ్రులు దిగులు పడుతున్నారు. ఓ వైపు అకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న స్కూల్ ఫీజులు వెరసి సామాన్యులకు పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో జూన్ మాసం వస్తుందంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. అయినా, పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఎంతకష్టమైనా..ఎప్పటిలాగే అప్పులు చేస్తూ పిల్లలను బడులకు పంపుతూనే ఉంటారు. విద్యా సంవత్సరం మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న దరిమిలా ప్రతి ఇంటిలో పిల్లలకు కావాల్సిన సామాగ్రీ కొనుగోళ్లు చేసే ప్రక్రియ మొదలైంది. జూన్ రెండవ వారంలో పాఠశాలలు, కళాశాలలు ఆరంభం కానున్న దరిమిలా ఆయా విద్యా సంస్థలకు పెరేంట్స్ వెళ్లి ఫీజులు, ఇతర సామాగ్రీ ధరల వివరాలు తెలుసుకుంటూ వాటికి అవసరమైన డబ్బులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. నెలకు 30 వేలు సంపాదించే ఉద్యోగే పిల్లల చదువుల భారమవుతున్నాయంటూ వాపోతుంటే, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, దినసరి కూలీలు, కార్మికుల పరిస్థితి ఏలా ఉంటుందో ఇక చెప్పనక్కర్లేదు. ఫీజులతోపాటు రెండు జతల యూనిఫారాలు, రెండు జతల బూట్లు, సాక్స్‌లు, పుస్తకాలు, నోటుబుక్కులు, బ్యాగులు, టై, బెల్ట్, పెన్నులు, పెన్సిళ్లు, ఏరైజర్, కంపాక్స్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఇలా ఒక్కటేమిటి పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి మొత్తం సరంజామాను సమకూర్చాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో వీటి కోసం సుమారు 20నుంచి 40వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఒక పిల్లవాడికి మాత్రమే. ఇద్దరు పిల్లలుంటే డబుల్ ఖర్చు అవుతుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటాయి. కూరగాయల ధరలు సైతం మండిపోతున్నాయి. వీటితోనే అల్లాడిపోతున్న సామాన్యులు అధిక భారం పడే జూన్ మాసం అంటేనే జంకే పరిస్థితి నెలకొంది. దీంతో జూన్ మాసంలో ప్రతి యేటా అప్పులు చేయడం రివాజుగా మారిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న ఫీజులతో పిల్లల చదువులు భారంగా మారుతున్నాయని సామాన్య జనం వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఫీజులు, చదువులకు కావాల్సిన సామాగ్రి ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.