కరీంనగర్

గాలి వాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 3: జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. గాలి తీవ్రస్థాయిలో వీచడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మంకమ్మతోటలోని ముత్తూట్ ఫైనాన్స్‌కు సంబంధించిన అద్దాలతో కూడిన భారీ డెకరేషన్ కుప్పకూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. రెండు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయి. ఈసమాచారం అందుకున్న కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యలు త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పక్కనే బిల్డింగ్ పై ఉన్న సెల్ టవర్ ఈదురు గాలులకు ఇళ్ళపై కూలింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నగరంలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. కలెక్టరేట్‌లో, కరీంనగర్ డిఎస్పీ కార్యాలయ సమీపంలో చెట్లువిరిగి రోడ్లపై పడిపోయాయి.