కరీంనగర్

రాజ్యసభకు కెప్టెన్ ఎన్నిక ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, జూన్ 3: రాజ్యసభకు మాజీ మంత్రి టిఆర్‌ఎస్ నేత కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండు రోజుల క్రితం కెప్టెన్ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మే 31న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. మొత్తం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఉండడంతో కెప్టెన్‌తో పాటు డి.శ్రీనివాస్‌లకు టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో టిఆర్‌ఎస్‌కు బలం ఉండడంతో కేవలం వీరిద్దరు మాత్రమే నామినేషన్లు వేశారు. ఇతర పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కావడంతో వీరు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శుక్రవారం ప్రకటించి ఎన్నికకు సంబంధించి ధృవపత్రాలు కూడా కెప్టెన్‌తో పాటు డిఎస్‌లకు అందజేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ స్థానాలకు జూన్ 11 ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక కెప్టెన్, డి ఎస్‌ల ప్రమాణ స్వీకారం మిగిలి ఉంది. ఈనెల 11 తర్వాతే ప్రమాణ స్వీకారానికి వీరిని ఆహ్వానించే అవకాశం ఉంది. కెప్టెన్ రాజ్యసభకు ఎన్నికకావడంతో అటు హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలతో పాటు కరీంనగర్ వరంగల్ జిల్లాలోని ఆయన అనుచరులు అభిమానుల్లో అనందోత్సాహాలు నెలకొన్నాయి.