విజయనగరం

హేతుబద్ధీకరణ కింద 411 టీచర్ పోస్టులకు కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జూన్ 3: హేతుబద్ధీకరణ కింద జిల్లాలో సుమారు 411 ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయి నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం స్థానిక మహాత్మా జ్యోతిలాల్ పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో కొత్తగా డి ఎస్సీకి ఎంపికైన ఎస్.జె.టి ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రేషన్‌లైజేషన్ వలన 411 ఉద్యోగాలు కోల్పోయినట్లు చెప్పారు. పిల్లలు తక్కువగా ఉండడం 116 పాఠశాలలను మూసివేసినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయాలని అన్నారు. ప్రాథమిక స్థాయిలో ప్రతి ఏడాది విద్యార్థులు తగ్గుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి చర్యలు చేపడుతున్నారని చెప్పారు. శిక్షణలో భాగంగా కమిటీలు వేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా అంగన్ వాడీ కేంద్రాల నుంచి రిలీవ్ అవుతున్న పిల్లలకు విధిగా పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఇఓ సత్యనారాయణ, బిసి రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మాజీరావు పాల్గొన్నారు.