విజయనగరం

జిల్లాలో మావోల కదలికలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, జూన్ 3: జిల్లాలో మావోల కదలికలు తగ్గుముఖంపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎల్. కాళిదాసు వెంకట రంగారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మక్కువ పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు స్టేషన్ పరిసరాలు, సిఆర్‌పిఎఫ్ పరిసర ప్రాంతాలు పరిశీలించి అనంతరం స్టేషన్‌లో క్రైం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆత్మీయ నేస్తం అనే బాక్సును ప్రతీ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. అలాగే ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో దత్తత గ్రామాల అభివృద్ధికి పాటుపడతామన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమానికి ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో 3వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారని, ఇంకా 20శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. పోలీసు సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పి సిద్దార్ధ్ కౌశిక్, సిఐ రామకృష్ణ, ఎస్‌ఐ పరంజ్యోతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.