కృష్ణ

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 4: విద్య వున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలని అందరం చదువుకుందాం, నేను చదివిస్తాను, మీ పిల్లలను స్కూలుకు పంపండని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పేదరికంపై గెలుపుకు కృషి చేస్తానని, ఆర్ధికంగా మహిళలు నిలదొక్కుకోటానికి పది శాతం వడ్డీతో నిధులు ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా శనివారం ఏ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, పవర్ గ్రిడ్, టూరిజం, ఫైబర్ గ్రిడ్ అంశాలపై ఆయా శాఖల నిపుణులతో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధికారిత దిశగా మహిళలు ఈ రోజు ధైర్యంగా వారి అభిప్రాయాలను వెల్లడించడం, సమస్యలపై చర్చించడం ఎంతో ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. తాను డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు వాటి వలన ఉపయోగం ఏమిటని ప్రశ్న వేసారని, ఈరోజు రాష్ట్రంలో ఒక ఉత్తేజభరితమైన శక్తిగా మహిళలు వున్నారన్నారు. చదువుకుంటే ఎంత బాగా చదువుతారో అంత వరకు తాను చదివించటానికి సిద్ధంగా వున్నానని, మీలో అపారమైన తెలివితేటలు, సామర్ధ్యం వుందని మీకు అండగా ఒక అన్నగా, తమ్ముడిగా వుంటానని ముఖ్యమంత్రి తెలిపారు. తలసరి ఆదాయం పెంచుకోవడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో వుంచాలని ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే వనరుల ద్వారా ఆ గ్రామ ప్రజల తలసరి ఆదాయం నిర్ధారణ అవుతుందన్నారు. తలసరి ఆదాయంలో విశాఖపట్నం, కృష్ణాజిల్లాలు పోటీపడుతున్నాయని, జిల్లాలు, మండలాలు మధ్య తలసరి ఆదాయంపై పోటీతత్వం వుండాలని అందుకు మంచి వాతావరణంలో ఒకరికొకరు పోటీపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అశాస్ర్తియ విధానంలో రాష్ట్రం విడిపోయినా, ఆర్ధికభారం వున్నా సంక్షేమానికి తాను కట్టుబడి వున్నానని, మీ కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానం జోడించి పింఛన్లు, నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు. కష్టంలో వుండి దీక్షలు చేస్తుంటే వేరొకరు సంబరాలు చేసుకుంటున్నారని విజయం సాధిస్తాననే నమ్మకం, ఆత్మవిశ్వాసం నాలో మీరందరూ పెంచారన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతుందని, భారతీయ సంస్కృతికి కుటుంబ వ్యవస్థ ఎంతో అవసరమని, కుటుంబాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మీ అందరిపై వుందన్నారు. చైనా, జపాన్, యూరప్ దేశాల్లో యువత లేరని, అందరూ ముసలివారేనన్నారు. కేంద్రంతో గొడవ పడమని కొంతమంది అడుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు సంవత్సరాల పసిపాప అని మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం వుందన్నారు. నేను ఎవ్వరితో రాజీపడలేదని, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నానన్నారు. అంతకుముందు సంక్షేమ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి వారు పొందిన లబ్దిని అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం నుంచి జరిగిన ఈ సదస్సులో పవర్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, టూరిజం, ఫైబర్ గ్రిడ్ వంటి అంశాలపై అభివృద్ధి వివరాలను చర్చించారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీ్ధర్, టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.